జాతీయ వార్తలు

యుపి సిఎం ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించి మొత్తం 403 సీట్లలో మూడు వంతులకు పైగా సీట్లను కైవసం చేసుకోవడంతో దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఆ రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేది ఎవరన్న విషయం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ ఎన్నికల ఫలితాలతోపాటు ఉత్తరప్రదేశ్‌కు తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న దానిపై చర్చించేందుకు బిజెపి పార్లమెంటరీ బోర్డు శనివారం రాత్రి సమావేశం కానుంది.
మనోజ్ సిన్హా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో టెలికామ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న మనోజ్ సిన్హా (57) రెండుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని ఘాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మనోజ్ సిన్హా భుమిహార్ కులానికి చెందిన అగ్రవర్ణ నాయకుడు.
కేశవ్ ప్రసాద్ వౌర్య
మధ్యప్రదేశ్‌లోని పూల్‌పూర్ నియోజకర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన కేశవ్ ప్రసాద్ వౌర్య (47) వెనుకబడిన కులానికి చెందిన నాయకుడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి సారథిగా వ్యవహరిస్తున్న ఆయనకు 1990వ దశకంలో రామాలయ ఉద్యమం తారస్థాయికి చేరినప్పటి నుంచి విహెచ్‌పితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
రాజ్‌నాథ్ సింగ్
కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేస్తున్న రాజ్‌నాథ్ సింగ్ (65) ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి చివరి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకుడైన ఆయన ఠాకూర్ కులానికి చెందినవారు. ఆయనకు గతంలో యుపి ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉంది.
మహేష్ శర్మ
గౌతమ బుద్ధనగర్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన మహేశ్ శర్మ ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో పర్యాటక మంత్రిగా పని చేస్తున్నారు. గతంలో యుపి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన శర్మ ఆర్‌ఎస్‌ఎస్‌కు సన్నిహితుడు.
దినేష్ శర్మ
లక్నో వర్శిటీలో అధ్యాపకునిగా పనిచేస్తున్న 53 ఏళ్ల దినేష్ శర్మ 2008లో లక్నో మేయర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షుడిగా బిజెపికి సేవలు అందిస్తున్న ఆయనను పార్టీ అధినేత అమిత్‌షాకు సన్నిహితుడిగా పరిగణిస్తున్నారు.