జాతీయ వార్తలు

రాష్టప్రతి ఎన్నికపైనే ఇక మోదీ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఘ నవిజయం సాధించటంద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్టప్రతి భవన్‌లో తాను కోరుకునే వ్యక్తిని నియమించుకునే స్థాయికి ఎదిగిపోయారు. ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 25తో ముగుస్తుంది. ఈలోగా కొత్త రాష్టప్రతి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. పార్లమెంటు ఉభయసభల సభ్యులు, 31 రాష్ట్రాల శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు చెందిన సభ్యులు రాష్టప్రతి ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. ఎంపీలు, శాసనసభ్యుల నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య ప్రకారం వారి ఓటు విలువను నిర్ణయిస్తారు. ఒక ఎంపీ ఓటు విలువ 708. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఒక శాసనసభ్యుడి ఓటు విలువ 403. ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా స్థానిక శాసనసభ్యుల ఓటు విలువ నిర్ణయిస్తారు. రాష్టప్రతి ఎన్నికల్లో మొత్తం ఓటర్ల విలువ పది లక్షల తొంబై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనబై ఎనిమిది. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రస్తుత ఓట్ల విలువ 4 లక్షల, 57 వేల 342. నరేంద్ర మోదీ తాను ఎంపిక చేసే వ్యక్తి రాష్టప్రతిగా ఎన్నిక కావాలంటే 5 లక్షల 50 వేల ఓట్లను సాధించుకోవలసి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ శాసనసభలోని మొత్తం 403 సీట్లలో నుండి 324 సీట్లు గెలుచుకోవటంద్వారా నరేంద్ర మోదీ ఎన్‌డిఏ బలాన్ని బాగాపెంచారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి, దాని మిత్రపక్షాలు గెలిచిన 324 సీట్ల ఓట్ల విలువ లక్షా 30 వేల 572. దీనికి ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఓట్ల విలువను జోడిస్తే ఎన్‌డిఏ బలం దాదాపు ఐదు లక్షల నలభై ఏడు వేలకు చేరుకుంటోంది. ఈ లెక్కన నరేంద్ర మోదీ తాను ఎంపిక చేసే అభ్యర్థిని రాష్టప్రతిగా గెలిపించుకునేందుకు ప్రతిపక్ష పార్టీల సహకారంపై ఆధారపడవలసి ఉండదు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి విజయం సాధించని పక్షంలో రాష్టప్రతి అభ్యర్థి ఎంపికకోసం ప్రతిపక్ష పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించవలసిన అవసరం ఉండేది. అయితే ఇప్పుడు యుపీలో బ్రహ్మాండమైన విజయం సాధించటంద్వారా మోదీ తాను ఎంపిక చేసే అభ్యర్థిని రాష్టప్రతి భవన్‌కు పంపించగలిగే రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్‌లో ఘనవిజయం సాధించిన తరువాత కూడా రాజ్యసభలో బిజెపికి మెజారిటీ రాదు. ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికల్లో 31 మంది ఎంపిక కావలసి ఉన్నా 2019 లోక్‌సభ ఎన్నికలలోగా కేవలం పది మంది మాత్రమే ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఈ లెక్కన రాజ్యసభలో ఎన్‌డియే ప్రస్తుత బలం 74లో పెద్దగా మార్పు ఉండదు.