క్రీడాభూమి

రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: జయాపజయాలు ఆటలో భాగమని, ఓటమికి కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తానని భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు స్పష్టం చేసింది. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మొదటిసారి క్వార్టర్ ఫైనల్స్ చేరిన సింధు తన ప్రత్యర్థి తాయ్ జూ ఇంగ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. మరో హైదరాబాదీ సైనా నెహ్వాల్ కూడా క్వార్టర్స్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొంది. ఆమెను సంగ్ జీ హ్యున్ ఓడించింది. కాగా, తాను గొప్పగా ఆడలేకపోయానని అంగీకరించిన సింధు, ఎవరికైనా కెరీర్‌లో ఒడిదుడుకులు సహజమని పేర్కొంది. ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ చేరడం సంతృప్తినిచ్చిందని చెప్పింది. తమదైన రోజున ఎవరైనా అద్భుత ఫలితాలు సాధిస్తారని, తమదికాని రోజున వైఫల్యాలు తప్పవని వ్యాఖ్యానించింది. ఎంతో మంది అభిమానుల అండ తనకు ఉందని తెలిపింది. రాబోయే టోర్నీల్లో మెరుగైన ఆటతో రాణించే సత్తా తనకు ఉందని పేర్కొంది.

స్టార్క్ స్థానంలో
కమిన్స్‌కు చోటు

రాంచీ, మార్చి 11: భారత్‌తో జరగాల్సిన చివరి రెండు టెస్టులకు కాలి గాయం కారణంగా దూరమైన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ స్థానంలో మరో పేసర్ పాట్ కమిన్స్‌కు చోటు దక్కింది. కమిన్స్ 2011లో దక్షిణాఫ్రికాతో ఒకే ఒక టెస్టు ఆడాడు. అందులో మొత్తం ఏడు వికెట్లు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 79 పరుగులిచ్చి ఆరు వికెట్లు కూల్చాడు. ఆతర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం అతనికి దక్కలేదు. ఇప్పుడు స్టార్క్ గాయపడడంతో కమిన్స్‌ను జట్టులోకి తీసుకున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. స్టార్క్ గాయపడడాన్ని దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించింది. అతను త్వరలోనే కోలుకుంటాడన్న ఆశాభావం వ్యక్తం చేసింది. వనే్డ, టి-20 ఇంటర్నేషనల్స్‌తోపాటు బిగ్ బాష్ మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా రాణిస్తున్న కమిన్స్ ఎంపిక సరైనదేనని వ్యాఖ్యానించింది.

డ్రీమ్ మ్యాచ్ కోసం ఎదురుచూపు!

ఇండియన్ వెల్స్: బ్రిటన్ ఆటగాడు కేల్ ఎడ్మండ్ తన కెరీర్‌లోనే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోబోయే డ్రీమ్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న ఇండిన్ వెల్స్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో గస్టావో ఇలియాస్‌ను 6-1, 6-3 తేడాతో ఓడించిన అతను రెండో రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌తో పోరాడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల కాలంలో చెప్పుకోదగిన స్థాయిలో రాణించలేకపోతున్నప్పటికీ, జొకోవిచ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఏ క్షణంలోనైనా ఎదురుదాడికి దిగి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చే సత్తావున్న అతని ఖాతాలో ఐదు ఇండియన్ వెల్స్ టైటిళ్లను సాధించిన అతను మరోసారి విజయభేరి మోగించేందుకు సన్నద్ధమవుతున్నాడు. మొదటి రౌండ్‌లో అతనికి బై లభించింది. ఇలావుంటే, అమెరికాకు చెందిన 19 ఏళ్ల టేలర్ ఫ్రిట్జ్ కూడా మొదటి రౌండ్‌ను సులభంగానే అధిగమించాడు. అతను ఫ్రాన్స్ ఆటగాడు బనోట్ ఫైర్‌ను 6-3, 6-2 తేడాతో ఓడించి, రెండో రౌండ్‌లో మూడో సీడ్ మారిన్ సిలిక్‌తో పోరును ఖాయం చేసుకున్నాడు. కాగా, ఫ్రాన్స్ ఆటగాడు స్టెఫెన్ రాబర్ట్ 6-4, 6-4 ఆధిక్యంతో డుడీ సెలా (ఇజ్రాయిల్)పై విజయం సాధించి ముందంజ వేశాడు. డానియల్ ఇవాన్స్ 6-1, 6-1 స్కోరుతో డస్టిన్ బ్రౌన్‌ను చిత్తుచేశాడు. అతను రెండో రౌండ్‌లో నిషికొరిని ఢీ కొంటాడు.