జాతీయ వార్తలు

అన్ని మతాల పరమార్థం అహింసే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 3: మహోన్నతమైన భారతీయ సంస్కృతే దాని అంతర్గత శక్తి అని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. దేశంలోని ప్రతి మతం నిజమైన స్ఫూర్తితో ధర్మ, అహింసా పథాలను అనుసరించాలని ఆయన ఉద్బోధించారు. శాంతి మార్గంలో ఏవిధంగా ముందుకు సాగాలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గనిర్దేశనం చేయగలుగుతుందని పేర్కొన్న ఆయన దేశ ప్రాచీన రుషుల ఉద్బోధనలను ప్రతి ఒక్కరూ ముందుగా తాము ఆచరించి అనంతరమే వాటి ప్రాధాన్యతను వ్యాపింపజేయాలని స్పష్టం చేశారు. చరిత్ర గతిలో ఏ సమయంలోనైనా దుష్టులూ, దుర్మార్గులూ ఉన్నారని, వారు నిరంతరం పుట్టుకొస్తూనే ఉంటారని వెల్లడించారు. అదేవిధంగా వీరిని మించిన స్థాయిలో వారిని మార్చగలిగే మానసిక శక్తి కలిగిన సన్మార్గులకూ కాలగతిలో కొదవ లేదని వెల్లడించారు. మంచి చేయాలనుకున్నప్పుడు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, అదే సద్భావనతో నిర్భయంగా సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనాలని ఆదివారం ఇక్కడ జరిగిన ఓ జైన సమావేశంలో భగవత్ స్పష్టం చేశారు. నిర్భయంగా ఉండటానికి ఎవరికీ శారీరక శక్తి అవసరం లేదని, అందుకు కావాల్సింది మానవీయ భావనేనని వెల్లడించారు. సన్మార్గంలో అహింసాయుత పథంలో ముందుకు వెళ్లడమే పరమావధిగా దేశంలోని అన్ని మతాలు ఉద్బోధనలు చేశాయని ఈ సందర్భంగా వెల్లడించారు. భారత్‌ను నిజమైన స్ఫూర్తితో గొప్ప దేశంగా మార్చాలంటే దానికనుగుణంగానే దేశ యువత ప్రగతి సాధించాలని, పరిణతిని సంతరించుకోవాలని అన్నారు. యువత అన్నివిధాలుగా అభివృద్ధి చెందినప్పుడే పరిణతిని సంతరించుకున్నప్పుడే ప్రపంచంలోకెల్లా మిన్న అయిన దేశంగా భారత్ రాణించగలుగుతుందన్నారు. ఇందుకు యువతలో నైతిక వర్తనను పాదుకొల్పాలని, వారి జీవితాలను సుగుణ సంపన్నంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఇందుకు ప్రాచీన రుషుల ఉద్బోధనలే శరణ్యమని, వీటిని ముందుగా ఎవరికివారుగా ఆచరించే వాటి ప్రాధాన్యతను చాటిచెప్పాలన్నారు.

పుణెలో ఆదివారం నిర్వహించిన శివశక్తి సంఘం కార్యక్రమంలో పాల్గొన్న భగవత్