ఆంధ్రప్రదేశ్‌

జలం..జగడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 22: ప్రపంచ జలవనరుల దినోత్సవం ఏపి శాసనసభలో జగడానికి కారణమయింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది.. ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి మాట్లాడేందుకు రెండు నిముషాల వ్యవధి కేటాయించాలని స్పీకర్‌ను కోరారు. అందుకు స్పీకర్ కోడెల శివప్రసాద రావు నిరాకరించారు. సభా నాయకుడు ప్రసంగించిన అనంతరం అనుమతి ఉంటుందన్నారు. దీంతో వైసిపి శాసనసభ్యులు స్పీకర్ పోడియం వద్దచేరి నినాదాలతో హోరెత్తించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు అవకాశమిచ్చారు. ప్రతిపక్షనేత మాట్లాడే సమయాల్లో మినహా వైసిపి ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేస్తున్నారని ప్రపంచ జలవనరుల దినోత్సవం సందర్భంగా జలం గురించి మాట్లాడమంటే ధనం గురించి ప్రస్తావిస్తారని ధ్వజమెత్తారు. జలయజ్ఞంను ధనయజ్ఞంగా మార్చిన వారికి సంరక్షణ ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, అప్పలనాయుడు మాట్లాడుతూ ముఖ్యమైన విషయంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం బాధ్యతను విస్మరించడం బాధాకరమన్నారు. బాయ్‌కాట్ చేయటం సిగ్గుచేటని సభా సమయాన్ని వృథాచేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా వైసిపి సభ్యులు ఇదేమి రాజ్యం..దొంగల రాజ్యం..దోపిడీ రాజ్యం అంటూ రెట్టించి నినాదాలు చేశారు. నొచ్చుకున్న సిఎం తాను ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్పీకర్‌కు ముందుగా నోటీసు పంపి ప్రసంగిస్తున్నట్లు తెలిపారు. దీనిపై వివరణలు, పాయింట్ ఆఫ్ ఆర్డర్లు ఉండవన్నారు. ప్రభుత్వ విధానాలు చెప్తున్నా.. నీటి భద్రతపై చెప్తా.. ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.. పదిమంది సభ్యులు రగడ చేసి సభకు అవరోధం కల్పిస్తే ప్రతిష్ట పెరగదన్నారు. దీంతో స్పీకర్ మరో మూడు నిముషాల్లో పోడియం వద్ద నుంచి వెళ్లకపోతే నిమమావళి ప్రకారం చర్యలు ఉంటాయని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో ప్రతిపక్షనేత జగన్‌తో సహా వైసిపి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో నీటి వనరుల లభ్యత..వినియోగం..చేపట్టిన చర్యల గురించి వివరించిన జల నిర్వహణ..్భద్రతపై సభ్యులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు హాజరయ్యారు. దీంతో మంత్రులు అచ్చన్నాయుడు, కామినేని శ్రీనివాస్ జోక్యం చేసుకుని ప్రతిపక్ష నేతకు ముందే చెప్పాం.. ప్రొసీడింగ్స్‌పై ట్యూషన్‌కు వెళ్లాలని చమత్కరించారు. వాకౌట్‌చేసి మధ్యలో వచ్చారు.. రూలింగ్ ఇవ్వండని స్పీకర్‌ను కోరారు. ఒక సబ్జక్టు గురించి మాట్లాడేటప్పుడు వాకౌట్ చేసిన ప్రతిపక్షానికి తిరిగి ఆ టాపిక్ పూర్తయ్యే వరకు సభలో ప్రవేశించే వీలులేదని దీనిపై రూలింగ్ ఇవ్వాలని పట్టుపట్టారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రసంగించే సమయంలో అంతరాయం కల్పిస్తున్నారని, శాసనసభ ఏ ఒక్కరి సొత్తుకాదని గ్రహించాలన్నారు. హౌస్ అంటే సొంతిల్లు కాదన్నారు. బిజెపి ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు స్పందిస్తూ రూలింగ్ ఇవ్వద్దని ప్రతిపక్షం ప్రతిజ్ఞ కోసం వచ్చి ఉండవచ్చేమో అనే సందేహం వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సభ్యులంతా ప్రతిజ్ఞ చేయాలన్నారు. రెండోసారి ప్రతిపక్ష సభ్యులు లేచి నిలబడి ప్రతిజ్ఞ చేస్తుండగా వైసిపి సభ్యులు వౌనంగా సీట్లలో కూర్చున్నారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.