జాతీయ వార్తలు

రైల్వే ప్రాజెక్టులను పరుగెత్తిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: రైల్వేశాఖ చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అవుతామని 17 రాష్ట్రాలు ముందుకొచ్చాయని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. బుధవారం లోక్‌సభలో మంత్రి మాట్లాడుతూ వౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పలు అనుంబంధ ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో పనులు పూర్తిచేస్తామన్నారు. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు అదే గమ్యస్థానానికి మరో రైలులో బెర్త్ కేటాయించే కొత్త పథకం త్వరలోనే ప్రారంభించినున్నట్టు సురేష్ ప్రభు వెల్లడించారు. యూనిక్ ఐడితో ఎంపీలు ఆన్‌లైన్లో టికెట్ల బుకింగ్, రద్దు సదుపాయం కల్పించనున్నట్టు, పార్లమెంటు సచివాలయ కార్యదర్శి ఆమోదం తరువాత ఇది అందుబాటలోకి వస్తుందన్నారు. అయితే తాము అడుగున్న ప్రశ్నలకు మంత్రి నుంచి సరైన స్పష్టమైన సమాధానం రావడం లేదని ట్విస్ట్ చేసి చెబుతున్నారని అధికార బిజెపి ఎంపీలు చింతామణి మాలవీయ, రవీంద్రరాయ్ స్పీకర్ దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని తాను పరిశీలిస్తానని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులకు చెప్పారు.