జాతీయ వార్తలు

ఇకనుంచి డిగ్రీ సర్ట్ఫికెట్లపై విద్యార్థి ఫొటో, ఆధార్ నెంబర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: ఇకనుంచి డిగ్రీ సర్ట్ఫికెట్లపై విద్యార్థి ఫొటో, ఆధార్ నెంబర్‌లు తప్పనిసరి చేయనున్నారు. బోగస్, నకిలీ సర్ట్ఫికెట్లను నిరోధించడంలో యుజిసి ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలకు యుజిసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డిగ్రీ ధ్రువీకరణ పత్రాలపై విద్యార్థి ఫొటో, ఆధార్ నెంబర్ ఉంటే పైచదువులు, ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరయ్యే సందర్భంలో పరిశీలన సులభంగా పూర్తవడమేకాకుండా నకిలీలను అరికట్టవచ్చని యుజిసి ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్నత విద్య ఏకరీతి, పారదర్శకతగా ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు యుజిసి కార్యదర్శి జెఎస్ సంధూ బుధవారం వెల్లడించారు. విద్యార్థుల డిగ్రీ సర్ట్ఫికెట్లపై విద్యార్థి ఫొటో, యూనిక్‌ఐడి/ఆధార్‌నెంబర్ తప్పనిసరి చేయాలని అన్ని వర్శిటీలను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. అలాగే కాలేజీల్లో ప్రవేశాల సమయంలోనే విద్యా సంస్థ పేరు, విద్యార్థి పార్ట్‌టైమా? ఫుల్‌టైమా? డిస్టెన్సా? అన్నది నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల జరిగిన యుజిసి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
అధికారాల విభజన ‘సుప్రీం’కూ వర్తిస్తుంది