జాతీయ వార్తలు

అధికారాల విభజన ‘సుప్రీం’కూ వర్తిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభలో ప్రభుత్వం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, మార్చి 22: అధికారాల విభజన అనేది ప్రజాస్వామ్యానికి చెందిన ఇతర మూల స్తంభాలలాగానే న్యాయ వ్యవస్థకు కూడా వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభకు తెలియజేసింది. సుప్రీంకోర్టు తాను ఇచ్చిన కొన్ని తీర్పుల ద్వారా శాసన వ్యవస్థ అధికారాల పరిధిలోకి చొరబడుతోందంటూ సభ్యు లు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. అంతేకాదు అణ్వస్త్రాలను ప్రయోగించే అధికారాలను అప్పగించడం ద్వారా దేశం ప్రధానిపై విశ్వాసం ఉంచినప్పుడు న్యాయశాఖ మంత్రి ద్వారా ఉత్తమమైన వారిని న్యాయమూర్తులుగా నియమించే విషయంలో ఆయనను ఎందుకు విశ్వసించకూడదని కూడా ప్రభుత్వం అభిప్రాయపడింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సభలోనే ఉన్నారు. జడ్జీల నియామకానికి సంబంధించి చేసిన కొత్త చట్టం చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా రవిశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసు లు, ఖాళీలకు సంబంధించి బిజెపి సభ్యుడు సంజయ్ జైశ్వాల్ అనుబంధ ప్రశ్నలు అడుగుతూ, క్రికెట్ నిర్వహణ మొదలుకొని మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల దాకా అనేక అంశాలపై తీర్పుల ద్వారా సుప్రీంకోర్టు శాసన వ్యవస్థలోకి చొరబడుతోందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను అన్ని పక్షాల సభ్యులు బల్లలు చరుస్తూ స్వాగతించారు. అయితే క్రికెట్ మేనేజిమెంట్‌పైన లేదా నీట్ ఎంట్రన్స్ పరీక్షపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై వ్యాఖ్యానించడానికి రవిశంకర్ నిరాకరించారు. కానీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రధాన అంగాలయిన కార్యనిర్వాహక, శాస న, న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజనను కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టుచాలా స్పష్టంగా పేర్కొందని ఆయన అన్నా రు. చట్టసభలు చట్టాలు చేస్తాయని, కార్యనిర్వాహక విభాగం వాటిని అమలు చేస్తుందని, న్యాయ వ్యవస్థ చట్టానికి భాష్యం చెప్తుందని, ఇది అన్ని వ్యవస్థలకూ సమానంగా వర్తిస్తుందని స్పష్టం చేశారు.
కాగా, కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సంబంధించి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఆన్‌లైన్ ప్రసారం ‘మానసిక ఒత్తిడి’ని సృష్టిస్తుందని చెప్పారు. అంతేకాదు లోక్‌సభ, రాజ్యసభల కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం చాలా సులభమని, ఎందుకంటే రెండు సభలే ఉంటాయని, అయితే అనేక వేల కోర్టు గదుల్లో జరిగే కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం చాలా కష్టమని ఆయన అన్నారు. అయితే సభ్యుడి సూచన పరిశీలించదగ్గదేనని ఆయన అభిప్రాయపడ్డారు. హైకోర్టులో కేసుల పెండింగ్‌కు సంబంధించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ కోర్టుల పని తీరులో అపభుత్వం జోక్యం చేసుకోదని చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా కోర్టుల్లో కేసుల సంఖ్య పెరిగిపోతుండడంపై సభ్యుల ఆవేదనను జ్యుడీషియరీకి తెలియజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.