జాతీయ వార్తలు

ఢిల్లీలోకి చొరబడ్డ జైషే ఉగ్రవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు దేశ రాజధానిలోకి చొరబడ్డారని, ప్రజలను నిర్బంధించడం సహా భారీ దాడులకు పాల్పడేందుకు వీరు పథకం పన్నుతున్నారని హెచ్చరికలు రావడంతో ఢిల్లీలో ఆదివారం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై శనివారం దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఇదే సంస్థకు చెందిన మరో ఇద్దరు తీవ్రవాదులు ఢిల్లీలోకి చొరబడ్డారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఢిల్లీ నగర పోలీసు కమిషనర్ బిఎస్.బస్సీ ఆదివారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాజధానిలో, ప్రత్యేకించి కీలక ప్రాంతాల్లో భద్రతను పెంపొందించేందుకు పారా మిలటరీ బలగాల సాయాన్ని అందించాల్సిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ‘జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు కీలక సభ్యులు ఢిల్లీలోకి చొరబడ్డారని, భారీ దాడులకు తెగబడటంతో పాటు స్థానికులను నిర్బంధించి సంక్షోభాన్ని సృష్టించేందుకు వీరు పథకం పన్నుతున్నారని నిఘా వర్గాల నుంచి గట్టి సమాచారం అందింది. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు అదనంగా కొన్ని కంపెనీల పారా మిలటరీ బలగాలను రప్పించాం’ అని ఆ అధికారి వివరించారు. పఠాన్‌కోట్‌లోని కీలక వైమానిక స్థావరంపై పాకిస్తాన్ తీవ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు శనివారమే ఢిల్లీని అప్రమత్తం చేసి ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఇతర జనసమ్మర్ధ ప్రదేశాల్లో భద్రతను గణనీయంగా పెంపొందించడంతో పాటు ఇతర కీలక ప్రదేశాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు.