జాతీయ వార్తలు

పంపిణీలాగే సంపద సృష్టీ ముఖ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ కాకపోతే అభివృద్ధికి అర్థం లేదని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు అంటూ, సంపద పంపిణీ ఎంత ముఖ్యమో, దాని సృష్టి కూడా అంతే ముఖ్యమని అన్నారు. ‘గతంలో మనం ఎప్పుడూ సంపద పంపిణీ గురించే మాట్లాడే వాళ్లం అయితే అలా చేయడానికి ముందుగా సంపదను సృష్టించాలి. మీరు ఆ పని చేయనప్పుడు అప్పులు తీర్చలేని వారుగా మారుతారు. చాలా రాష్ట్రాల్లో, ప్రపంచంలోని చాలా దేశాల్లో అదే జరుగుతోంది’ అని వెంకయ్యనాయుడు అన్నారు. ఎక్కువ సంపదను సృష్టించకపోతే పేదరికాన్ని పంచుతాము. సంపదను సృష్టించడంపైన మనం దృష్టిపెట్టాలి, అందుకు సంస్కరణలు అవసరం’ అని బుధవారం ఇక్కడ ఆలిండియా మేనేజిమెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ)కు చెందిన మూడవ నేషనల్ లీడర్‌షిప్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి అన్నారు. మరో పదేళ్లలో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేసియా దేశాలు ఆసియాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉంటాయని ఆయన చెప్పారు. ‘మరో పదేళ్లలో భారత్ జపాన్‌ను మించిపోవచ్చు. నిజమైన పోటీ భారత్, చైనాల మధ్యే ఉంటుంది. ఈ రెండు దేశాలు కూడా సంపద పంపిణీనే నమ్మేవి. అయితే ఇప్పుడు సంపద సృష్టివైపు వాటి దృష్టి మళ్లింది’ అని వెంకయ్యనాయుడు అన్నారు. మోదీ ప్రభుత్వం తన అభివృద్ధి అజెండాకు కట్టుబడి ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేస్తూ, అందరికీ వర్తించనప్పుడు అభివృద్ధికి అర్థం లేదని, అందుకే తాము సమ్మిళిత అభివృద్ధిపై దృష్టిపెడుతున్నామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రజల తీర్పుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అభివృద్ధి కోసం ప్రజలు ఎంతగా ఆరాటపడుతున్నారో కూడా ఈ తీర్పు చాటిచెప్పిందని ఆయన అన్నారు.
. అంతేకాదు ప్రజలు ఒక సారి తీర్పు ఇచ్చిన తర్వాత నిర్మాణాత్మక రాజకీయాలకు వెళ్లాలి తప్పితే విచ్ఛిన్నకర రాజకీయాలకు కాదనే విషయాన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు.