జాతీయ వార్తలు

మోదీతోనే దేశాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్‌ఎం కృష్ణ బుధవారం బిజెపి తీర్థంపుచ్చుకున్నారు. సుమారు నాలుగున్నర దశాబ్దాలపైగా కాంగ్రెస్‌లో పనిచేసి అనేక ఉన్నతపదవులు పొందిన 84ఏళ్ల కృష్ణ పార్టీలో తనకు సరైన గుర్తింపునివ్వడం లేదని రాజీనామా చేశారు. బుధవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కృష్ణ పార్టీలో చేరారు. ప్రధాని మోదీ, అమిత్ షాల నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని ఆయన ప్రశించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బిజెపికి కృష్ణ రాక ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలకు విశ్వాసప్రాతుడైన కృష్ణ 1999 నుంచి 2004 వరకూ కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగళూరును ఐటి హబ్‌గా చేయడంలో ఆయన ఎంతో కృషిచేశారు. యుపిఏ హయాంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావించారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తనను పట్టించుకోలేదని కృష్ణ కినుకవహించారు. కర్నాటక శాసన సభకు వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీనియర్ నాయకుడు కృష్ణ బిజెపిలో చేరటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కర్నాటకలోని ముఖ్యమైన వర్గాల్లో ఒకటైన వక్కలిగ వర్గానికి చెందిన కృష్ణ రాకతో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. రా ష్ట్ర బిజెపి అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యు డు యెడ్యూరప్ప రెండో ముఖ్యమైన లింగాయత్ వర్గానికి చెందిన నాయకుడు.వక్కలిగ వర్గానికి చెం దిన కృష్ణ, లింగాయత్ వర్గానికి చెం దిన యెడ్యూరప్పల నాయకత్వంలో బిజెపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయసంగా అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంటున్నారు.