కృష్ణ

బాలకార్మికుల భవితకు ఉపాధ్యాయులే నిర్మాతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: జిల్లాలోని బాలకార్మికుల ప్రత్యేక శిక్షణ కేంద్రాల ను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులదేనని ఎన్‌సిఎల్‌పి ప్రాజెక్టు డైరెక్టర్, విజయవాడ సహాయ కార్మిక కమిషనర్ డి ఆంజనేయరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని 17 బాల కార్మికుల ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు హనుమాన్‌పేటలో ని తాన భవన్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయుల నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో స త్సంబంధాలు కలిగి ఉండాలని, బాల కార్మికుల ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆంజనేయరెడ్డి కోరారు. అనేక కారణాల వల్ల చదువుకు దూరమై పనుల్లో మగ్గుతున్న బాల కార్మికులను ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో చేర్చి వారికి విద్యను అందిస్తున్నట్లు, వీరికి చదువుతో పాటు వృత్తివిద్యలలో శిక్షణ ఇస్తున్నామని తెలిపా రు. ప్రస్తుతం 648 మంది పిల్లలు జిల్లాలోని వివిధ ప్రాంతాలలోని బాలకార్మికుల ప్రత్యేక శిక్షణ కేంద్రాలలో చదువుతున్నారని, శిక్షణ పూర్తన వెంటనే వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆంజనేయరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని ఎఎల్‌ఎం ప్రకాష్‌కుమారి, సహాయ కార్మిక అధికారి బిఎస్‌ఎం వల్లి, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ అరన రమేష్, ప్రొగ్రామ్ మేనేజర్ ప్రసన్న పాల్గొని పాఠశాలల నిర్వహణలో విద్యా నైపుణ్యాలలో శిక్షణని అందించారు.

గ్రామాల్లో నీటి సమస్య రానీయొద్దు
విజయవాడ, మార్చి 22: వేసవిలో గ్రామాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ చెప్పారు. బుధవారం ఆమె విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో జెడ్పీ ఇన్‌చార్జి సిఈవో సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్, పం చాయితీరాజ్ ఇంజనీర్లతో తాగునీరు, సిసిరోడ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అనూరాధ మాట్లాడుతూ డెల్టా ప్రాంతానికి కాలువల ద్వారా విడుదల చేసిన నీటిని డెల్టా ఆయకట్టు చివరి ప్రాంతం వరకు చేరేలా చూడాలని ఇంజనీర్లను ఆదేశించారు. ముఖ్యంగా పెడన, కృత్తివెన్ను ప్రాంతాలకు కాలువల ద్వారా మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మంచినీరు సరఫరా చేసే బోర్లు, పైప్‌లైన్లకు ఏమైనా మరమ్మతులు వుంటే తక్షణం చేయించాలన్నారు. జిల్లాలో వివిధ గ్రామాల్లో నిర్మించవలసి వున్న 38వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను మే నెల చివరి నాటికి పూర్తిచేయాలన్నారు. తరువాత పంచాయితీరాజ్ ఇంజనీర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సిసిరోడ్ల నిర్మాణాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కన్వర్‌జెన్సీ పద్ధతిలో చేపట్టవలసిన పనులు జరిగేలా పంచాయితీరాజ్ ఇంజనీర్లు చొరవ చూపాలన్నారు. జిల్లాలో నిర్మించవలసి వున్న అంగన్‌వాడీ కేంద్రాలను మే 5 నాటికి పూర్తిచేయాలని పంచాయితీరాజ్ ఇంజనీర్లను చైర్‌పర్సన్ అనూరాధ ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు, పంచాయితీరాజ్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.