జాతీయ వార్తలు

రైలు ప్రయాణికులకు శుచి, శుభ్రమైన ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: రైలు ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టినట్టు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. శుచి, శుభ్రతతో కూడిన ఆహార పదార్ధాలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. కేటరింగ్ సర్వీసులు మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రైళ్లలో నాసిరకమైన ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నట్టు వస్తున్న ఫిర్యాదులై సభలో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రయాణికులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేందుకు ప్రముఖ కంపెనీల సేవలను వాడుకుంటామన్నారు. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు సురేష్ ప్రభు తెలిపారు. ఇప్పటికే అనేక రైల్వే స్టేషన్లలో పరిశుభ్రమైన మంచినీటిని సరసమైన ధరకు అందేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉండగా కేటరింగ్ కాంట్రాక్టు కుదిరిందన్న మంత్రి వ్యాఖ్యలు సభలో వేడిపుట్టించాయి. తృణమూల్ కాంగ్రెస్, బిజెపి సభ్యుల మధ్య వాగ్వివాదం తలెత్తింది. కాగా సీల్దాలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఆహారం తీసుకున్న కొందరు ప్రయాణికులు కడుపునొప్పితో బాధపడినట్టు వచ్చిన వార్తలపై మంత్రి స్పందించారు. వార్తా కథనాల ఆధారంగా కాంట్రాక్ట్ వెండర్‌ను తొలగించినట్టు సురేష్ ప్రభు ప్రకటించారు.