జాతీయ వార్తలు

రాష్టప్రతి రేసులో లేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, మార్చి 29: రాష్టప్రతి పదవి రేసులో తన పేరు ఉన్నట్లు వస్తున్న వార్తలను రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలను ఎట్టి పరిస్థితిలోనూ ప్రోత్సహించరాదని ఆయన అన్నారు. ‘నన్ను రాష్టప్రతి పదవిని నామినేట్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు’ అని రాజ్‌వాడా ప్యాలెస్‌లో బుధవారం జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో అన్నారు. తాను సంఘ్ పరివార్ సభ్యుడినేనని, పరివారానికే తన జీవితం అంకితమని ఆయన స్పష్టం చేశారు. ‘మేము సంఘంలో చేరినప్పుడే ఇతర అవకాశాలన్నింటికీ తలుపులు పూర్తిగా మూసివేశాం. మేం సంఘంకోసం, సమాజంకోసమే పనిచేస్తాం. రాష్టప్రతి పదవికి నా పేరు రాదు. వచ్చినా నేను అంగీకరించను’ అని భాగవత్ తేల్చి చెప్పారు. రెండు రోజుల క్రితం శివసేన అధినేత సంజయ్ రౌత్ భాగవత్ పేరును రాష్టప్రతి పదవికి ప్రతిపాదించాలని ప్రభుత్వానికి సూచించారు. ‘ఇది దేశంలో అత్యున్నత పదవి. స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఉన్నవారు ఈ పదవిని చేపట్టాలి. మోహన్ భాగవత్ పేరు చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది. దేశాన్ని హిందూరాష్ట్రంగా చేయాలనుకుంటే భాగవత్ కంటే మంచి వ్యక్తి రాష్టప్రతి పదవికి మరొకరు ఉండరు’ అని సంజయ్ వ్యాఖ్యానించటంతో దీనిపై వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ తదితర పార్టీలు వెంటనే ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. అంతేకాకుండా తామూ అభ్యర్థిని నిలబెట్టనున్నట్లు పేర్కొన్నాయి.