జాతీయ వార్తలు

అదనపు బలగాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్, జనవరి 3: ఆర్నెల్లు తిరక్కుండానే పంజాబ్‌పై రెండో ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో మరింతగా భద్రతా దళాలను మోహరించాల్సిన అవసరం ఎంతో ఉందని ఉపముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్ బాదల్ ఉద్ఘాటించారు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఉన్న రాష్ట్ర సరిహద్దుల పొడవునా బిఎస్‌ఎఫ్ దళాలను మరింతగా మోహరించడం ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎంతో అవసరమని తెలిపారు. ఉగ్రవాద దాడులను పటిష్టంగా నిరోధించేందుకు రాష్ట్ర పోలీసులు రెండో రక్షణ వలయంగా ఏర్పడతారని, ఇందుకు వీలుగా వ్యవస్థను సన్నద్ధం చేస్తామని తెలిపారు. అదనపు బిఎస్‌ఎఫ్ బలగాల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నామని జమ్మూకాశ్మీర్‌లో భద్రతా పరమైన చర్యలను ఏవిధంగా తీసుకుంటున్నారో అదే తరహాలో రాష్ట్ర సరిహద్దుల్లో కూడా అదనపు బలగాలను మోహరించడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్ దాడుల తీవ్రతను బట్టి చూస్తే భవిష్యత్తులో ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యగా అదనపు బలగాల మోహరింపు తక్షణావసరమని తెలిపారు. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్‌ను ఆనుకుని ఉన్న సరిహద్దు పొడవునా ఉగ్రవాదులు చొరబడేందుకు ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో నిగ్గు తేల్చాలని, వాటిని మూసివేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉగ్రవాదులు సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి ప్రవేశించగలిగారంటే సరిహద్దుల్లో ఎక్కడో కచ్చితంగా లోపం ఉండి ఉంటుందని, ‘ఈ తరహా విఘాతక చర్యలను నిరోధించేందుకు రెండో రక్షణ వలయం ఏర్పాటు ఎంతో అవసరం’ అని తెలిపారు.
chitram...
పఠాన్‌కోట్‌లో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతున్న పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్