జాతీయ వార్తలు

బాబ్రీ కేసులో తీర్పు రిజర్వ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి సీనియర్ నేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతిలను మళ్లీ విచారించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు బిజెపి నేతలు కుట్ర పన్నారని సిబిఐ అభియోగం. 1992 డిసెంబర్ 6న జరిగిన మసీదు ధ్వంసం కేసును అద్వానీ, జోషీ, ఉమాభారతిని మళ్లీ విచారించాలని సిబిఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మొత్తం 14 మంది బిజెపి నేతలపై సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసును లక్నో ట్రయల్ కోర్టు కొట్టివేయగా అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. దీంతో మళ్లీ విచారించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా జస్టిస్ పిసి ఘోష్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. సిబిఐ తన వాదనలను వినిపించింది. తీర్పును ధర్మాసనం రిజర్వ్‌లో ఉంచింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. మొదటి దాంట్లో కరసేవకులను బాధ్యులుగా చూపారు. దీన్ని లక్నో కోర్టు విచారించింది. బిజెపి సీనియర్ నేతలున్న రెండో కేసును రాయ్‌బరేలీ కోర్టు విచారించారు. బాబ్రీ ఘటన జరిగి పాతికేళ్లు జరిగిపోయిందని, సత్వర న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రోజువారీ ప్రాతిపదికన విచారణ జరిపే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. రెండు సంవత్సరాల వ్యవధిలో కేసు విచారణ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా వెల్లడించింది. రెండు కేసులను లక్నో కోర్టులోనే విచారించాలన్నదానిపై సుప్రీం నిర్ణయం తీసుకోవల్సి ఉంది. రాయ్‌బరేలీ ట్రయల్ కోర్టు నుంచి కేసును లక్నో కోర్టు బదిలీ చేయాలని పిటిషనర్ కోరారు. కాగా పిటిషనర్ వాదనను అద్వానీ, జోషీ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ కెకె వేణుగోపాల్ వ్యతిరేకించారు. అయితే రెండు కేసులను కలిపే విచారించాలని సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ వాదించారు. బాబ్రీ మసీదు ధ్వంసం ఘటన వెనక ఒకే కుట్ర దాగి ఉన్నందున రెండు కేసులను కలిపే విచారించాలని కోర్టును ఆయన అభ్యర్థించారు. దీనికి మంగళవారం నాటికి లిఖితపూర్వంగా అభిప్రాయాలు తెలియజేయడానికి ఉభయ పార్టీలకు కోర్టు అవకాశం కల్పించింది. తొలుత అద్వానీ, జోషీ సహా 21 మందిపై కేసు నమోదయింది. కేసు విచారణలో ఉండగానే ఎనిమిది మంది చనిపోయారు. తరువాత 13 మందిని కుట్రదారులుగా పేర్కొంటూ అదనపుచార్జిషీట్ దాఖలు చేసింది. బిజెపి నేతలు అద్వానీ, జోషీ, ఉమాభారతి, కల్యాణ్ సింగ్‌లను నిర్దోషులుగా విడుదల చేశారు. కల్యాణ్‌సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్నారు. అలాగే శివసేన అధినేత బాల్‌థాక్రే, విహెచ్‌పి నేత ఆచార్య గిరిరాజ్ కిశోర్(ఇద్దరూ చనిపోయారు)లను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120 బి(నేరపూరిత కుట్ర)కింద బిజెపి నేతలపై అభియోగాలను 2010 మే 20 అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.