జాతీయ వార్తలు

రాష్ట్రాల ఆమోదమే ఆలస్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6:కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోదం లభించింది. అనుకున్నట్టుగా జూలై 1 నుంచి జిఎస్‌టి అమలులోకి రావాలంటే అన్ని రాష్ట్రాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. లోక్‌సభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో ఇక రాష్ట్రాల ఆమోదమే మిగిలింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలను తిరస్కరించిన అనంతరం సెంట్రల్ జిఎస్‌టి, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి, జిఎస్‌టి (రాష్ట్రాలకు పరిహారం), కేంద్ర పాలిత ప్రాంతాల జిఎస్‌టి బిల్లులను రాజ్యసభ ఆమోదించింది.అన్ని రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం లభిస్తే ఈ చారిత్రక పరోక్ష పన్నుల విధానం దేశ వ్యాప్తంగా అమలులోకి వస్తుంది. దీనిపై ఎనిమిది గంటల పాటు రాజ్యసభలో జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పారు. జిఎస్‌టి అమలు వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్న ఆందోళనలకు అర్థం లేదన్నారు. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే వ్యాపారస్తులకు అధికారుల నుంచి ఎలాంటి వేధింపులు ఉండవని, ఒక వస్తువుకు దేశ వ్యాప్తంగా ఒకే పన్ను ఉంటుందని జైట్లీ స్పష్టం చేశారు. 5,12,18,28 శాతంగా ఆయా వస్తు సేవల్ని బట్టి నాలుగు రేట్లలో జిఎస్‌టి పన్నులు అమలు అవుతాయి. మే 18-19తేదీల్లో జరిగే సమావేశంలో జిఎస్‌టి మండలి వీటిపై చర్చించాల్సి ఉంటుంది.