జాతీయ వార్తలు

శాస్ర్తీయ పరిశోధనలు సులభతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూరు, జనవరి 3: భారత్‌లో విజ్ఞాన శాస్త్రాల పరిశోధనలు చేయడాన్ని సులభతరం చేస్తామని, సైన్స్ పరిపాలనను మెరుగుపరుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో విజ్ఞాన శాస్త్రాల బోధన, పరిశోధనను విస్తృతం చేయడంతో పాటు వాటి నాణ్యతను మెరుగుపరుస్తామని ఆయన శాస్తవ్రేత్తలకు వివరించారు. అయిదు రోజుల పాటు సాగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సి) 103వ సెషన్‌ను ఆదివారం ఇక్కడ మైసూరు విశ్వవిద్యాలయంలోని ‘మానస గంగోత్రి’ క్యాంపస్‌లో ప్రధాని ప్రారంభించారు. శాస్తవ్రేత్తలు పనిచేసే సమయంలో ‘అయిదు ఇలు- ఎకానమి (ఆర్థిక వ్యవస్థ), ఎన్విరాన్‌మెంట్ (పర్యావరణం), ఎనర్జీ (శక్తి), ఎంపతి (తాదాత్మ్యం), ఈక్విటి (సమానత్వం)పై కేంద్రీకరించాలని ఆయన తన ప్రారంభోపన్యాసంలో పిలుపునిచ్చారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ప్రతి రంగంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు.
కేంద్రానికి, రాష్ట్ర స్థాయి సంస్థలు, ఏజెన్సీలకు మధ్య గొప్ప శాస్ర్తియ భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు. సాంప్రదాయిక విజ్ఞానానికి, ఆధునిక సైన్స్‌కు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించేందుకు ఈ రెండింటిని అనుసంధానం చేయాలని దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి, విదేశాల నుంచి వచ్చిన శాస్తవ్రేత్తలను ప్రధాని కోరారు. దీనివల్ల సవాళ్లకు నిలకడయిన పరిష్కారాలను కనుక్కోవచ్చని ఆయన సూచించారు. శాస్తవ్రేత్తలు, టెక్నాలజిస్టులు తమ శాస్త్ర పరిశోధనలో, ఇంజినీరింగ్‌లో తాను సూచించిన ‘అయిదు ఇల’ సూత్రాన్ని మనసులో పెట్టుకొని పనిచేస్తే సైన్స్ ప్రభావం అత్యధికంగా ఉంటుందని మోదీ తెలిపారు. తక్కు వ వ్యయంతో సమర్థవంతమైన పరిష్కారాన్ని కనుగొనడానికి ‘ఎకానమి’, పర్యావరణ సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపే కర్బన వాయువులను కనిష్టంగా విడుదల చేయడానికి ‘పర్యావరణం’ ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. మన సంపద విద్యుచ్ఛక్తిపై తక్కువ ఆధారపడినప్పుడే మనం ఉపయోగించే శక్తి మన ఆకాశాన్ని నీలిరంగులో, మన భూమిని ఆకుపచ్చ రంగులో ఉంచుతుందని, దీనికి ‘ఎనర్జీ’ ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. మన సంస్కృతి, పరిసరాలు, సామాజిక సవాళ్లకు అనుగుణంగా మనం కృషి చేయడానికి ‘ఎంపతి’ దోహదపడుతుందన్నారు. శాస్త్ర విజ్ఞానం సంఘటిత వృద్ధిని ముందుకు తీసికెళ్లినప్పుడు, అత్యంత బలహీనుల సంక్షేమాన్ని మెరుగుపరచినప్పుడు సమానత్వం (ఈక్విటి) సాధ్యమవుతుందన్నారు.
సుపరిపాలన అనేది కేవలం విధానాలు, నిర్ణయాలు తీసుకోవడం, పారదర్శకత, జవాబుదారీతనాలకే సంబంధించినది కాదని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీకృతం చేసి వ్యూహాలను రూపొందించడానికి సంబంధించినది కూడా అని ప్రధాని అన్నారు. ప్రభుత్వంలోని విజ్ఞానశాస్త్ర విభాగాలు, విజ్ఞానశాస్త్ర సంస్థల తనిఖీకి ఒక శాస్ర్తియమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని తాను ఆదేశించినట్లు మోదీ వెల్లడించారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు వనరులను పెంచడానికి కూడా తాము కృషి చేస్తామని, తమ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆ నిధులను కేటాయిస్తామని ప్రధాని చెప్పారు.
chitram...
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 103వ సెషన్‌లో ప్రధాని మోదీకి మెమొంటోను బహూకరిస్తున్న దృశ్యం