ఆంధ్రప్రదేశ్‌

మోదీ జీ...ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 6:మిర్చి రైతుకు గిట్టుబాటు ధర లభించకపోవటంపై రాష్ట్ర మంత్రి మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిందిగా కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రిమండలి విస్తరణ జరిగిన తరువాత తొలిసారిగా వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం కేబినెట్ భేటీ అయింది. అనంతరం వివరాలను మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. వ్యవసాయ మంత్రి చంద్రమోహన్‌రెడ్డి, ధరల నియంత్రణ శాఖ మంత్రి పుల్లారావు వెంటనే గుంటూరు మిర్చి యార్డును సందర్శించి పరిస్థితులను చక్కదిద్దాలని సిఎం ఆదేశించారు. ఈ ఏడాది 5వేల చెక్‌డ్యాంలను నిర్మించాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే నిర్మించిన చెక్‌డ్యాంలలో పూడికతీసి శుభ్రం చేయాలని, వర్షాకాలం నాటికి కాలువలు, చెరువుల మరమ్మతు పనులను పూర్తిచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వేసవిలో మంచినీటి అవసరాలపై కూడా మంత్రి మండలిలో చర్చించారు. కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, పంచాయతీరాజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని, వడదెబ్బ బాధితులకోసం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు. హీరో మోటో కార్స్ కంపెనీతో జరిగిన ఒప్పందంలో సవరణలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి దశలో 800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయనుందని తెలిపారు. ఎపి ల్యాండ్ డెవలప్‌మెంట్ రూల్స్ 2017 ముసాయిదా రూపొందించాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రి మండలి ఆమోదం లభించింది. కొత్త లే అవుట్లు, రోడ్లు, ఓపెన్ స్పేస్, వీధి దీపాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, మంచినీటి సరఫరా తదితర అంశాలపై విధి విధానాలను ఈ బిల్లులో పొందుపరుస్తారు. గుంతకల్లు పట్టణ పరిధిలో సమ్మర్ స్టోరేజి ట్యాంకు నిర్మాణం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సివిఆర్ కాంప్లెక్స్‌లోని ఆంధ్రా హాస్పటల్స్ లీజు కాలపరిమితిని 20 ఏళ్లకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం ఇర్కం గ్రామం తిరువేంకటనగర్‌లో ఎ-4 మద్యం దుకాణం స్వాధీనపర్చుకునేందుకు మంత్రిమండలి ఆదేశించింది.

గురువారం వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు