జాతీయ వార్తలు

విశాఖకు పెట్రో వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: విశాఖపట్నంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఈ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పెట్రో వర్శిటీపై నిర్ణయం తీసుకుంది. విశాఖలో రూ.655.46 కోట్ల పెట్టుబడి వ్యయంతో పెట్రోలియం, ఇంధన యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. అలాగే వర్శిటీకి ఎండోమెంట్ నిధులు రూ.200 కోట్లు, అదనంగా మరో రూ.200 కోట్లు ఆయిల్ కంపెనీలు సహకారం అందించనున్నాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 13కింద వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం గతంలోనే నిర్ణయించటం తెలిసిందే. ఈ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా పెట్రోలియం విభాగంలో నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, పరిశోధనలకు అవకాశలు ఏర్పడనున్నాయి. అలాగే కృష్ణా గోదావరి బేసిన్, విశాఖలో ఏర్పాటు చేయనున్న పెట్రోలియం రిఫైనరీకి ఈ యూనివర్సిటీని అనుసంధానిస్తారు. అలాగే కాకినాడలో ఏర్పాటు చేయనున్న పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కూడా కొత్తగా ఏర్పాటు చేయనున్న వర్శిటీతో అనుసంధానించనున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలిలో ఏపీ ప్రభుత్వం ఈ వర్సిటీ ఏర్పాటుకు 200 ఎకరాల భూమి కేటాయించింది. 2016-17 ఏడాదిలోనే 50మంది విద్యార్థులతో ఆంధ్ర యూనివర్సీటీ క్యాంపస్‌లో డిగ్రీలో పెట్రోలియం ఇంజనీరింగ్ మరియు కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల కోర్సుల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ సహాయంతో క్లాసులు నిర్వహిస్తున్నారు.