జాతీయ వార్తలు

రోజుకో ధర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఇప్పటి వరకూ పక్షానికో సారి మారుతూ వచ్చిన పెట్రో, డీజిల్ రేట్లు మే నెల నుంచి రోజువారీగా మారబోతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు రేట్ల ప్రకారం ప్రతి రోజూ పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పులు ఉండబోతున్నాయి. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లోనూ అమలు అవుతున్న ఈ విధానాన్ని భారత్‌లో కూడా అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.దేశంలోని 58వేల పెట్రోలు బంకుల్లో 95శాతం బంకుల్ని కలిగి ఉన్న ఐఓసి, బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్‌లు మే ఒకటి నుంచి ఎంపిక చేసిన ఐదు నగరాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. పైలెట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి దేశంలోని ఇతర పట్టణాలకూ ఈ రోజువారీ రేట్ల మార్పు విధానాన్ని విస్తరిస్తారు. ప్రారంభంగా దక్షిణాదిన వైజాగ్, పాండిచ్చేరిల్లో, పశ్చిమాన ఉదయ్‌పూర్‌లో, తూర్పున జంషెడ్‌పూర్, ఉత్తరాన చండీగఢ్‌లో దీన్ని అమలు చేస్తామని ఐఓసి చైర్మన్ బి అశోక్ తెలిపారు.