జాతీయ వార్తలు

దారి మళ్లుతున్న ‘సంక్షేమం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 5వేల కోట్లు ఏమయ్యాయి?
ఖర్చు లెక్క లేకపోవడంపై సుప్రీం ఆగ్రహం
ఆడిట్ జరిపి రెండువారాల్లో నివేదిక ఇవ్వండి
కాగ్‌ను ఆదేశించిన న్యాయమూర్తులు
అదృశ్యం కాలేదు.. రాష్ట్రాల వద్ద ఉన్నాయి
వివరణ ఇచ్చిన అదనపు సొలిసిటర్ జనరల్
మే 5న తదుపరి విచారణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలోని కూలీల సంక్షేమానికి ఉద్దేశించిన వేలాది కోట్ల రూపాయలు ‘దారిమళ్లడం’పై సుప్రీం కోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇందుకోసం కేటాయించిన 27వేల కోట్ల రూపాయల వినియోగమే జరుగలేదని, ఇందులో 5వేల కోట్ల ఎందుకు ఖర్చయ్యాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని తెలిపింది. ఇంత భారీ మొత్తాన్ని ఎందుకు ఎలా వినియోగించారో నిగ్గుదేల్చాలంటూ కాగ్‌ను ఆదేశించింది. రెండు వారాల్లో ఈ 5వేల కోట్ల ఆచూకీని తేల్చాలని న్యాయమూర్తులు ఎమ్‌బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచి స్పష్టం చేసింది. ‘మొత్తం 27వేల కోట్ల రూపాయల్లో ఇప్పటి వరకూ 5వేల కోట్లను ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారు. ఇంత మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారో తెలీదు. దీన్ని టీలకో, భోజనానాలతో ఖర్చు చేసి ఉంటారా..మరి ఇంత మొత్తం ఏమైనట్టు’అని అదనపు సొలిసిటర్ జనరల్ మనీందర్ సింగ్‌ను సుప్రీం బెంచి ప్రశ్నించింది. ‘ ఈ వ్యవహారంలో భారీ మొత్తం ఉంది. ఇది పూర్తిగా దేశంలోని కడు పేద వర్గాల సంక్షేమం కోసం వినియోగం కావాల్సింది.కానీ అలా జరగడం లేదు. ఇది దారిమళ్లుతోంది’అని న్యాయమూర్తులు తీవ్ర స్వరంతో అన్నారు. అయితే ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉందని, ఇది అదృశ్యం కాలేదని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు నివేదించారు. కానీ, తమకు ఈ విషయంలో చెప్పిన విషయం దిగ్భ్రాంతి కలిగిస్తోందని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం ఓ పరిష్కార మార్గాన్ని కనుగొనడం ఎంతైనా అవసరమని న్యాయమూర్తులు ఉద్ఘాటించారు. పిటిషనర్ తరపున వాదించిన కోలిన్ గంజాల్వేజ్ ‘ఇంత భారీ మొత్తం బదిలీ అయింది. అన్ని అవసరాలకూ దీన్ని వాడుకుంటున్నారు’అని కోర్టుకు తెలిపారు. ఇది ఎంత మొత్తం కావచ్చునో చెప్పండని కాగ్ అధికారిని కోర్టు ప్రశ్నించడంతో ‘27వేల కోట్ల రూపాయల వరకూ కావచ్చు’నని ఆయన జవాబిచ్చారు. మరి ఇందులో 5వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారు కదా..అన్న ప్రశ్నకు ‘దీనిపై దర్యాప్తు జరపాల్సి ఉంది. అనంతరం ఆడిట్ నివేదిక ఇస్తాం’అని తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ మే 5కు వాయిదా పడింది.