జాతీయ వార్తలు

పఠాన్‌కోట్‌లో ఇంకా ఉన్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్, జనవరి 4: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో మరో ఇద్దరిని సోమవారం భద్రతా దళాలు హతమార్చాయి. మూడు రోజుల నుంచి పోరాడుతున్న భద్రతా దళాలు ఆపరేషన్‌ను ఇంకా కొనసాగిస్తున్నాయి. పఠాన్‌కోట్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు నక్కివున్నట్టు సమాచారం ఉన్నా, కేంద్రంగానీ సైనిక బలగాలుగానీ స్పష్టంగా ప్రకటించలేపోతున్నాయి. ఇప్పటివరకూ ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దాడికి తెగబడిన ముష్కరులంతా హతమయ్యారా? లేదా? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. దేశ భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన సోమవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ పఠాన్‌కోట్‌లో హతమైన ఆరుగురు ఉగ్రవాదుల్లో భద్రతా దళాలు నలుగురి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. మిగిలిన రెండు మృతదేహాలను కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటాయని తెలిపారు. కాగా, ఈ ఉగ్రదాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) మూడు కేసులు నమోదు చేసింది.
పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని అధికారులు గత రెండు రోజుల నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జైట్లీ వెల్లడించిన ఉగ్రవాద మృతుల సంఖ్య కూడా దీనితో సరిపోతోంది. అలాగే పఠాన్‌కోట్‌లో వైమానిక దళ ఆస్తులన్నీ సురక్షితంగా ఉన్నాయని కూడా జైట్లీ ప్రకటించారు. అయితే ఆపరేషన్ ముగిసిందని, లేక అక్కడ ఉగ్రవాదులు ఇంకెవరూ లేరని ప్రకటించేందుకు ఇటు ప్రభుత్వవర్గాలు, అటు ఆపరేషన్‌తో ప్రమేయం ఉన్న భద్రతా దళాల అధికారులుగానీ సిద్ధంగా లేరు. అయితే పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో ఇంకా ఉగ్రవాదులెవరైనా నక్కి ఉన్నారేమో అనే్వషిస్తున్నామని, దేశంలోనే ఎంతో కీలకమైన ఈ వైమానిక స్థావరం పూర్తి సురక్షితంగా ఉందని నిర్ధారణకు వచ్చే వరకూ గాలింపు చర్యలు కొనసాగుతాయని నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్‌ఎస్‌జి) ఐజి మేజర్ జనరల్ దుశాంత్ సింగ్ స్పష్టం చేశారు.
దాడికి పాల్పడింది మేమే : యుజెసి
ఇదిలావుంటే, పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో దాడికి తెగబడింది తామేనని పాక్ ఆక్రమిత కాశ్మీరు (పిఓకె) కేంద్రంగా పనిచేస్తున్న యుజెసి (యునైటెడ్ జిహాద్ కౌన్సిల్) తీవ్రవాద సంస్థ సోమవారం ప్రకటించుకుంది. యుజెసిలోని ‘హైవే స్క్వాడ్’కు చెందిన కాశ్మీరీ మిలిటెంట్లు దాడి జరిపినట్టు తీవ్రవాద సంస్థ ప్రతినిధి సయ్యద్ సదాకత్ హుస్సేన్ స్పష్టం చేశాడని శ్రీనగర్‌కు చెందిన వైర్ సర్వీస్ ‘సిఎన్‌ఎస్’ వెల్లడించింది. ప్రతి దాడికీ పాకిస్తాన్‌ను నిందిస్తున్న భారత్ కాశ్మీరులో ‘స్వాతంత్య్ర పోరాటాన్ని’ అపఖ్యాతి పాలు చేయడంలో ఇంతకుముందెన్నడూ సఫలీకృతం కాలేకపోయిందని, మున్ముందు కూడా విజయవంతం కాలేదని సదాకత్ హస్సేన్ చెప్పుకున్నాడు. కాశ్మీరులో గత 27ఏళ్ల నుంచి పోరాడుతున్న మిలిటెంట్లను హతమార్చి ‘కాశ్మీరు ఉద్యమాన్ని’ అణచివేసేందుకు భారత్ అన్ని రకాల మార్గాలను అవలంబిస్తోందని చెప్పాడు.

చిత్రం... పఠాన్‌కోట్‌లో సైనిక బలగాలు కొనసాగిస్తున్న ఆపరేషన్