జాతీయ వార్తలు

జనరిక్‌కు పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, ఏప్రిల్ 17: భారీ రేట్లు కలిగిన ఇంగ్లీషు మందులకు బదులు చౌకగా లభించే జనరిక్ మందులనే రోగులకు రాసే విధంగా చట్టాన్ని తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత తమ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చిందని దీని వల్ల మందులు, స్టెంట్‌ల రేట్లు భారీగా తగ్గాయని చెప్పారు. అయితే ఇది అనేక ఫార్మా కంపెనీలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. సోమవారంనాడిక్కడ ఓ చారిటబుల్ ఆసుప్రతిని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ప్రధాని సంపన్నులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
భారత దేశాన్ని నిర్మించింది రాజులు, నాయకులు కారని, ప్రజాశక్తితోనే ఇది నిర్మితమైందని అన్నారు. ‘వైద్యులు రాసే మందుల పేర్లు వారి రాత కారణంగా పేదలకు అర్థమయ్యే పరిస్థితి ఉండదు. అయినా వీటిని ప్రైవేటు దుకాణాల ఉంచి భారీ ధరకు కొనక తప్పదు’అని ప్రధాని అన్నారు. ఈ పరిస్థితిని తొలగించేందుకు త్వరలోనే నిబంధనలు తెస్తామని ‘జనరిక్ మందులు కొంటే సరిపోతుంది. ఇతర మందులు కొనాల్సిన అవసరం లేదు’అని వైద్యులే స్వయంగా మందులు చీటీపై రాసి ఇచ్చేలా ఈ నిబంధనలు ఉంటాయని తెలిపారు. ‘మన దేశంలో వైద్యుల సంఖ్య తక్కువ. సరిపడ ఆసుపత్రులు లేవు. మందుల ధరలు మాత్రం చాలా ఎక్కువ. ఓ కుటుంబంలో ఎవరికైనా అస్వస్తత వస్తే ఆ కుటుంబ పరిస్థితి చితికి పోతుంది. ఇల్లు కొనలేరు. ఆడ పిల్ల పెళ్లి కూడా చెయ్యలేని స్థితిలో పడిపోతుంది’అని మోదీ అన్నారు. కనీస ఖర్చుతో ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. తీవ్రమైన వ్యాధులతో బాధపడే పేదలకు అందుబాటులో ఉండేలా దాదాపు 700 మందుల గరిష్ట ధరల్ని నిర్ణయించామని చెప్పారు. గుండె జబ్బులకు సంబంధించి కూడా స్టెంట్‌ల ధరలకూ కళ్లెం వేశామన్నారు. ఈ నిర్ణయాల వల్ల బలమైన ఫార్మా లాబీ ఆగ్రహం చెందినా కూడా తమ ప్రభుత్వం మధ్య తరగతి, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు చౌకగా లభించేలా చర్యలు తీసుకుంటూనే వస్తోందని చెప్పారు. చౌకగా ప్రజలకు జనరిక్ మందులు లభించేలా తమ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి జన ఔషధి పరియోజన’ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. అనారోగ్యం బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, ఇలాంటి చర్యలు చేపడితే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరమే ఉండదన్నారు.

చిత్రం... పిఎం ఆవాస్ యోజన మంజూరీ పత్రాలను లబ్ధిదారులకు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ