జాతీయ వార్తలు

ఈసారి మంచివానలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రోజురోజుకూ మండుతున్న ఎండలను చూసి ఆందోళన చెందుతున్న రైతాంగానికి భారత వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త మంగళవారం తెలిపింది. ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే వర్షాకాలంలో 96శాతం వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనాలను విడుదల చేసింది. ఈ వర్షాకాలం ఎల్‌నినో ప్రభావం నుంచి తప్పించుకునే అవకాశాలున్నాయని వివరించింది. ఐ ఎండి డైరెక్టర్ కెజె శ్రీనివాస్ మాట్లాడుతూ దేశమంతటా 96శాతం సగటుతో ఎక్కువ కాలం (ఎల్‌పిఏ) వర్షాలు పడతాయని తెలిపారు. 96 నుంచి 104 శాతం వర్షాలు పడటం సాధారణంగా పరిగణిస్తారని అంతకంటే తక్కువగా పడితే సాధారణం కంటే తక్కువగా భావిస్తామని ఆయన వివరించారు. గత సంవత్సరం 107శాతం వర్షపాతం పడుతుందని అంచనా వేయగా 97శాతం నమోదయిందని ఆయన తెలిపారు. అయితే సెప్టెంబర్ 2016 నాటికి ముగిసిన వర్షాకాలంలో దేశంలో 3శాతం తక్కువ వానలు పడ్డాయని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక వెలువరించింది. మరోవైపు ఉత్తర, పశ్చిమ భారతాలు ఎండలతో మండిపోతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలలో రానున్న మూడు నాలుగు రోజుల్లో వడగాలులు వీస్తాయని తెలిపారు. మహారాష్టల్రో వడగాలులకు ఇప్పటికే 9మంది మరణించారు.