జాతీయ వార్తలు

బాబ్రీ కేసులో నేడు సుప్రీం తీర్పు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా బిజెపి సీనియర్ నేతలపై కుట్ర అభియోగాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం తీర్పునిచ్చే అవకాశం ఉంది. న్యాయమూర్తులు పిసి ఘోష్, ఆర్‌ఎఫ్ నారిమన్‌తో కూడిన సుప్రీం బెంచి ఈ కేసుపై విచారణ జరుపుతుంది. ఈ కూల్చివేత సంఘటనకు సంబంధించిన అభియోగాలను రెండు కేసులుగా విభజించారు. మొదటి కేసులో గుర్తు తెలియని కరసేవకులను నిందితులుగా పేర్కొన్నారు. దీని విచారణ లక్నో కోర్టులో జరుగుతోంది. వివిఐపిలకు సంబంధించిన రెండో కేసు విచారణ రాయ్‌బరేలీ కోర్టులో జరుగుతోంది. ఈ రెండు కేసులను లక్నో కోర్టుకే బదిలి చేసి సంయుక్త విచారణ జరిపే అవకాశం ఉందన్న సంకేతాలను సుప్రీం బెంచి ఇటీవల అందించింది. బాబ్రీ సంఘటన జరిగి పాతికేళ్లయిందని, రోజువారీ విచారణ జరపడం ద్వారా రెండేళ్లలోనే దీన్ని ఓ కొలిక్కి తేవాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయ పడింది. కేసుల సంయుక్త విచారణను, వీటిని లక్నో కోర్టుకు తరలించాలన్న ఆలోచనను అద్వానీ ప్రభృతుల తరపు న్యాయవాది కెకె వేణుగోపాల్ ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రెండు కేసుల్లో నిందితులుగా పేర్కొన్న వ్యక్తులు భిన్న నేపథ్యం కలిగిన వారని, పైగా సంబంధిత కోర్టుల్లో వీటి విచారణ ఇప్పటికే ఎంతో పురోగమించిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు కేసులనూ సంయుక్తంగా విచారిస్తే వ్యవహారం మొదటికొస్తుందన్నారు. కుట్ర కేసుకు సంబంధించి ఇప్పటికే అద్వానీ సహా 13మందిపై కుట్ర అభియోగాలను తొలగించారు. దీని విచారణ రాయ్ బరేలీ కోర్టులో జరుగుతోంది. మొత్తం 21 మందిపై కుట్ర అభియోగాలు దాఖలయ్యాయి. అయితే అద్వానీ తదితరులపై వీటిని తొలగించడాన్ని సిబిఐ సవాలు చేసింది. అద్వానీ తదితరుల్ని మినహాయించి కేవలం ఎనిమిది మందిపైనే అనుబంధ చార్జిషీటు దాఖలైంది.