బిజినెస్

ఆరంభ లాభాలు ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగిన వరుస నష్టాలు ౄ సెనె్సక్స్ 95, నిఫ్టీ 34 పాయింట్లు పతనం
మదుపరుల కొనుగోలు శక్తిని దెబ్బతీసిన అంతర్జాతీయ ప్రతికూలతలు

ముంబయి, ఏప్రిల్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. సోమవారం నష్టపోయిన నేపథ్యంలో ఉదయం ప్రారంభంలో సూచీలు లాభాల్లో నడిచినప్పటికీ, చివరిదాకా ఆ లాభాలు నిలబడలేకపోయాయి. గత వారానికీ నష్టాలతోనే సూచీలు ముగింపు పలికినది తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా నాలుగోరోజు పతనాన్ని అందుకుంటూ మంగళవారం ట్రేడింగ్‌లోనూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 94.56 పాయింట్లు క్షీణించి 29,319.10 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 34.15 పాయింట్లు పడిపోయి 9,105.15 వద్ద నిలిచింది. ప్రారంభంలో సెనె్సక్స్ 267 పాయింట్లు, నిఫ్టీ 78 పాయింట్ల మేర పెరిగాయి. అయితే భౌగోళిక ఆందోళనకర పరిస్థితులు, బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే చేసిన ముందస్తు ఎన్నికల ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లను కుదేలు చేసింది. దీంతో దేశీయంగానూ మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. మరోవైపు 95,000 మందికిపైగా విదేశీ ఉద్యోగులు వినియోగిస్తున్న వర్క్ వీసాను రద్దు చేస్తూ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం, హెచ్-1బి వీసా విధానాన్ని అమెరికా కఠినతరం చేస్తుండటం వంటి అంశాలూ స్టాక్ మార్కెట్ లాభాలను హరించివేశాయి. అలాగే ఈ ఏడాది సాధారణ వర్షాలేనన్న వాతావరణ శాఖ అంచనాలూ మదుపరులను లాభాల స్వీకరణకు ఉసిగొల్పాయి. దీంతో రియల్టీ, మెటల్, ఎనర్జీ, టెలికామ్, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ దిగజారింది. అయితే యుటిలిటిస్, పవర్ రంగాల షేర్ల విలువ పెరిగింది. ఇక ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్ సూచీలు నష్టపోగా, జపాన్ సూచీ లాభపడింది. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు కూడా పతనమయ్యాయి.
రిలయన్స్ దూకుడు..
మదుపరుల కొనుగోళ్ల జోరుతో ఉదయం ఆరంభంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల దిశగా పయనించాయి. ఈ క్రమంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) షేర్ల విలువా పరుగులు పెట్టింది. దీంతో దాని మార్కెట్ విలువ సెనె్సక్స్ టాప్-10 సంస్థల్లో అగ్రగామిగా ఉన్న టిసిఎస్‌ను దాటేసింది. దేశీయ ఐటి రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మార్కెట్ విలువ 4.56 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే, ఆర్‌ఐఎల్ 4.58 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో మార్కెట్ విలువపరంగా అత్యంత విలువైన సంస్థగా ఆర్‌ఐఎల్ అవతరించింది. అయితే మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మళ్లీ అగ్రస్థానంలోకి టిసిఎస్ చేరింది. నాలుగేళ్ల క్రితం రిలయన్స్‌ను టిసిఎస్ వెనక్కినెట్టింది. అయతే జియో రాకతో రిలయన్స్ మార్కెట్ విలువ మళ్లీ పుంజుకుంటోంది. దీంతో టిసిఎస్, రిలయన్స్ మధ్య వ్యత్యాసం కూడా క్రమేణా తగ్గుతోంది.
ఒఎన్‌జిసిని మించిన ఎస్‌బిఐ
మరోవైపు స్టాక్ మార్కెట్లలో లిస్టయిన ప్రభుత్వరంగ సంస్థల్లో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ మార్కెట్ విలువ అగ్రస్థానంలోకి చేరింది. చమురు, సహజవాయువు ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసిని ఎస్‌బిఐ అధిగమించింది. ట్రేడింగ్ ముగిసేనాటికి ఎస్‌బిఐ మార్కెట్ విలువ 2,35,307.51 కోట్ల రూపాయలుగా ఉంటే, ఒఎన్‌జిసి మార్కెట్ విలువ 2,32,345.72 కోట్ల రూపాయలుగా ఉంది.