బిజినెస్

టిసిఎస్ లాభం రూ. 6,608 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 18: దేశీయ ఐటి రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్).. గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 6,608 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 6,340 కోట్ల రూపాయలుగా ఉండగా, ఈసారి 4.2 శాతం వృద్ధిని అందుకుంది. మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకా రం ఆదాయం ఈసారి 29,642 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 28,449 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, తమ ప్రధాన విదేశీ మార్కెట్లలో ఆర్థిక, రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ గత 2016-17 ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోదగ్గ వృద్ధిరేటును సాధించగలిగామని టిసిఎస్ సిఇఒ, ఎండి రాజేశ్ గోపినాథన్ అన్నారు. 2016-17లో కన్‌స్టెంట్ కరెన్సీ రెవిన్యూ 1.4 బిలియన్ డాలర్లు పెంచుకోగలిగామన్నారు. ఇకపోతే ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2016-17)) మొత్తంగా సంస్థ నికర లాభం 8.3 శాతం పెరిగి 26,289 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం 1,17,966 కోట్ల రూపాయలుగా ఉంది. ఇకపోతే ఈ జనవరి-మార్చి వ్యవధిలో స్థూలంగా 20,093 మంది ఉద్యోగులను టిసిఎస్ పెంచుకుంది. నికరంగా 8,726 మంది పెరగగా, మొత్తం సంస్థ ఉద్యోగుల సంఖ్య 3,87,223 మందికి చేరింది.