జాతీయ వార్తలు

డేటా రక్షణకు ఓ చట్టం సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: డేటా రక్షణపై ఒక చట్టాన్ని తీసుకు వచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. డేటా రక్షణకు సంబంధించిన అన్ని అంశాలను తాము పరిశీలిస్తున్నామని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి చెప్పారు. యూజర్ డేటాను ఇతరులతో పంచుకోవడానికి అవకాశం కల్పించే వాట్సాప్ పాలసీ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘిస్తోందా అనే విషయాన్ని విచారిస్తున్న ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ముందుకు ఈ అంశం వచ్చింది. కాగా, రాజ్యాంగానికి వ్యాఖ్యానం చెప్పడానికి సంబంధించిన నిర్దిష్ట ప్రశ్నలను తదుపరి విచారణ తేదీ అయిన ఈ నెల 27న రూపొందించడం జరుగుతుందని సుప్రీం కోర్టు తెలియజేసింది. వాట్సాప్ యజమాని ఫేస్‌బుక్ సంస్థ తన కొత్త ప్రైవసీ పాలసీని అమలు చేయడానికి అనుమతిస్తూ గత ఏడాది ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలయిన అపీలుపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. భారతీయులకు సంబంధించిన డేటాను నియంత్రించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవాలని పిటిషన్ దాఖలు చేసిన కర్మణ్య సింగ్ సరీన్ అనే విద్యార్థి తన పిటిషన్‌లో కోరారు.