క్రీడాభూమి

బోస్టన్ మారథాన్‌లో భారతీయుడి ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోస్టన్, ఏప్రిల్ 18: జన్యు పరమైన సమస్యల కారణంగా దృష్టిని కోల్పోవడంతో పాటు ఇంకా ఎన్నో సమస్యలతో పోరాడుతున్న బెంగళూరు వాసి సాగర్ బహెతి అరుదైన ఘనత సాధించాడు. అంథుల విభాగంలో అతను ప్రతిష్టాత్మక బోస్టన్ మారథాన్‌ను విజయవంతంగా పూర్తిచేశాడు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 3000 మందికి పైగా రన్నర్లు పాల్గొన్న ఈ రేస్‌లో 31 ఏళ్ల సాగర్ బహెతి 42.195 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 14 నిమిషాల 7 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి 18వ స్థానంలో నిలిచాడు. అత్యంత ప్రాచీనమైన బోస్టన్ రేస్ ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లలో ఒకటిగా ఉంది. పురుషులు, మహిళల రేసులతో పాటు విజువల్లీ ఇంపెయిర్డ్, మొబిలిటీ ఇంపెయిర్డ్, వీల్‌చైర్ అండ్ హ్యాండ్‌సైకిల్ రన్నర్స్ విభాగాల్లో ఈ మారథాన్‌ను నిర్వహించారు. 26652 నెంబర్‌తో సోమవారం ఈ రేసులో పాల్గొన్న సాగర్ బహెతి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఫినిషింగ్ లైన్‌ను అధిగమించాడు. ఆ సమయంలో బహెతి తల్లిదండ్రులు అక్కడే ఉండి ఆయనను ప్రోత్సహించారు. ఎంఎబివిఐ (మసాచుసెట్స్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ అండ్ విజువల్లీ ఇంపెయిర్డ్) సహాయ సహకారాలతో సాగర్ బహెతి ఈ మారథాన్‌లో పాల్గొన్నాడు.