జాతీయ వార్తలు

మంటపెట్టిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణాచల్‌లోని ఆరు ప్రాంతాలకు అధికారిక పేర్లు
మరోసారి రెచ్చగొట్టే చర్యకు దిగిన డ్రాగన్

బీజింగ్, ఏప్రిల్ 19: చైనా మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే చర్యకు దిగింది. భారత వ్యతిరేక కార్యకలాపాల స్థాయిని పెంచింది. టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడం పట్ల కొద్ది రోజుల క్రితం భారత్‌కు తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన డ్రాగన్ (చైనా), ఇప్పుడు ఏకంగా ఈ రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు ప్రామాణికమైన అధికారిక పేర్లను ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా ఇలా ప్రామాణికమైన అధికారిక పేర్లు ప్రకటించడం ఇదే తొలిసారి. చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను ‘దక్షిణ టిబెట్’గా పేర్కొంటున్న విషయం తెలిసిందే. ‘దక్షిణ టిబెట్’ తనదేనని పునరుద్ఘాటించడానికే చైనా ఈ రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు ప్రామాణికమైన అధికారిక పేర్లను ప్రకటించిందని చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ బుధవారం నాటి సంచికలో పేర్కొంది. చైనా ప్రభుత్వ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 14న ‘దక్షిణ టిబెట్’లోని ఆరు ప్రాంతాలకు చైనా లక్షణాలతో కూడిన టిబెటన్, రోమన్ అక్షరాలతో ప్రామాణికమైన అధికారిక పేర్లను ప్రకటించిందని ఆ పత్రిక తెలిపింది. చైనా కేంద్ర ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ఈ పేర్లను ప్రకటించినట్లు తెలిపింది. చైనా ప్రకటించిన ఆరు పేర్లు వోగ్యాయిన్‌లింగ్, మిలారి, కొయిడ్‌నగార్బో రి, మెయిన్‌కుకా, బిమోలా, నమ్‌కపుబ్ రిగా ఉన్నాయి. 3,488 కిలో మీటర్ల పొడవు గల వాస్తవాధీన రేఖ వెంట భారత్, చైనా సరిహద్దు వివాదం ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా దక్షిణ టిబెట్‌గా పేర్కొంటుండగా, మరోవైపు, భారత్.. చైనా 1962 యుద్ధంలో ఆక్రమించుకున్న ఆక్సాయి చిన్ వివాదాస్పద ప్రాంతమేనని పేర్కొంటోంది. ఈ సరిహద్దు వివాదం పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు 19సార్లు ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిగాయి. చైనా వివాదాస్పద ప్రాంతంపై తన భౌగోళిక, సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడానికే ఆరు ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టిందని చైనాలోని నిపుణులు పేర్కొన్నట్టు ‘గ్లోబల్ టైమ్స్’ వెల్లడించింది. ప్రాంతాలకు చట్టబద్ధంగా పేర్లు పెట్టడం చట్టపరమైన పాలనలో భాగమని బీజింగ్‌లోని మింజు యూనివర్శిటీ ఆఫ్ చైనాలో ఎథ్నిక్ స్టడీస్‌లో ప్రొఫెసర్ జియాంగ్ కుంజిన్ చెప్పినట్టు ఆ పత్రిక పేర్కొంది.