జాతీయ వార్తలు

అమర జవాన్లకు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబాలా/ బెంగళూరు, జనవరి 4: పాకిస్తాన్ ముష్కర మూకలనుంచి పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని కాపాడే ప్రయత్నంలో నేలకొరిగిన అమర జవాన్లకు సోమవారం ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. పూర్తి అధికార లాంఛనాలతో జరిగిన అంత్యక్రియలలో సమర వీరులకు తుడి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. త్రివర్ణ పతాకంలో చుట్టి తీసుకువచ్చిన గరుడ్ కమాండో గుర్‌సేవక్ సింగ్ భౌతికకాయం అతని స్వగ్రామమైన అంబాలా సమీపంలోని గర్‌నాలా గ్రామానికి చేరుకున్న వెంటనే ‘్భరత్ మాతాకీ జై’ అనే నినాదాలు మిన్నంటాయి. గత సంవత్సరం నవంబర్‌లోనే వివాహమైన ఈ సిక్కు యువకుడి వీరమరణంతో అతని కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి. హర్యానా మంత్రులు అనిల్ విజ్, అభిమన్యుతో పాటు వైమానిక దళం, ఆర్మీ, పోలీసు, పౌర పాలనకు చెందిన సీనియర్ అధికారులు అమర జవాను సింగ్ అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు.
పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఒక ఉగ్రవాది మృతదేహం నుంచి గ్రెనేడ్‌ను వేరుచేసే క్రమంలో అది పేలి వీరమరణం పొందిన లెఫ్టినెంట్ కల్నల్ ఇ.కె.నిరంజన్ భౌతికకాయాన్ని బెంగళూరుకు తీసుకువచ్చి, తరువాత అతని స్వగ్రామమైన కేరళలోని పాలక్కడ్‌కు తరలించారు. నిరంజన్ కుటుంబ సభ్యులు ఆయన మృతదేహం వద్ద కూర్చొని రోదించడం అక్కడ ఉన్న ప్రజలందరినీ కంటతడి పెట్టించింది. ‘అతను ఎప్పుడూ ఆర్మీలో పనిచేయడానికి ఆసక్తి ప్రదర్శించేవాడు. అతని త్యాగానికి నేను గర్విస్తున్నాను’ అని నిరంజన్ తండ్రి శివరాజన్ చెప్పారు. నిరంజన్‌కు భార్య డాక్టర్ రాధిక, ఏడాదిన్నర కుమార్తె ఉన్నారు. 32 ఏళ్ల నిరంజన్ కుటుంబం బెంగళూరులోనే ఉంటోంది. తోటి ఆర్మీ అధికారులు, అనేక మంది ప్రముఖులు నిరంజన్ ఇంటికి చేరుకొని ఆయన భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు.
పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌లో గల మరో సమరవీరుడు సుబేదార్ ఫతేసింగ్ (51) నివాసానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. ఫతేసింగ్ భౌతికకాయాన్ని శ్మశానవాటికకు మోసుకెళ్తున్న సైనికులలో అతని కుమార్తె మధు కూడా చేరారు. తన తండ్రి చేసిన త్యాగానికి తాను గర్విస్తున్నానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉగ్రవాదులు దాడికి దిగిన సమయంలో తాము ఎయిర్‌బేస్ వద్ద కూర్చొని ఉన్నామని ఆమె చెప్పారు.

బెంగళూరులో లెఫ్టినెంట్ కల్నల్ ఇ.కె.నిరంజన్ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న బంధువర్గం. అంబాలాలో గరుడ్ కమాండో గుర్‌సేవక్ సింగ్ భౌతికకాయానికి
అంత్యక్రియలు నిర్వహిస్తున్న సహచర జవాన్లు. జమ్మూలో లెఫ్టినెంట్ కల్నల్ మూల్‌రాజ్ మృతదేహానికి నివాళులర్పిస్తున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్ గంగ