జాతీయ వార్తలు

రాజీనామా ప్రశే్నలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కుట్ర కేసును సుప్రీం కోర్టు పునరుద్ధరించినంత మాత్రాన తాను మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రశే్న లేదని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పష్టం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగటం తథ్యమని ఆమె చెప్పారు. బాబ్రీ కూల్చివేతకు సంబంధించి తాము ఏం చేసినా అంతా బహిరంగంగానే చేశామని, ఇందులో కుట్ర లేనేలేదని ఆమె చెప్పారు. ఉమాభారతితో పాటు బిజెపి సీనియర్ నేతలు లాల్‌కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషిలపై బాబ్రీ కుట్ర కేసులను సుప్రీంకోర్టు పునరుద్దరించిన అనంతరం ఉమాభారతి మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని పార్టీ నుండి తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ‘‘బాబ్రీ ఘటనలో మేం చేసిన క్రిమినల్ కుట్ర ఏమిటి? ఆనాడు ఏం చేసినా బహిరంగంగానే చేశాము, కాబట్టి కుట్ర జరిగిందనే వాదనలో పస లేదు’’ అని ఉమాభారతి అన్నారు. రామజన్మ భూమి ఉద్యమంలో భాగస్వామినైనందుకు తానెంతో గర్వపడుతున్నానని అన్నారు. బాబ్రీ కట్టడం కూల్చివేతకు తాను ఏమాత్రం బాధపడటం లేదని, రేపు అయోధ్యలో పర్యటించనున్నానని ఉమాభారతి వెల్లడించారు. రానున్న రోజుల్లో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దేశం ఆవు, గంగ, తిరంగ (త్రివర్ణ పతాకం), రాముడిదని ఆమె ఆవేశంతో చెప్పారు. వీటికి ఎక్కడ అవమానం జరిగినా పోరాడతానని ఉమాభారతి చెప్పారు. కాంగ్రెస్ ఈ అంశంపై చేసే ఎలాంటి ఆరోపణలకు తాను జవాబు ఇవ్వదలచుకోలేదన్నారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసినప్పుడు సోనియా గాంధీ రాజీవ్ గాంధీ నివాసంలో ఉన్నారని, అంతమాత్రాన ఆమె సిక్కుల ఊచకోత కుట్రలో ఉన్నట్లా? అని ఆమె ప్రశ్నించారు.
ఆమె తప్పుకోరు: జైట్లీ స్పష్టం
బాబ్రీ కేసు పునర్విచారణకు సుప్రీం ఆదేశం నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉమాభారతి పదవి నుంచి తప్పుకునే ప్రశే్న లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పార్టీ సీనియర్ నేత అద్వానీని రాష్టప్రతి పదవికి ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడినప్పటికీ ఇబ్బంది రాబోదని ఆయన అన్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులను ఖరారు చేయటంలో అడ్డంకులు రావనే అన్నారు. ‘‘మంత్రు లున్నారు. ఉపప్రధానులు ఉన్నారు. చార్జిషీట్ దాఖలు చేయటమే రాజీనామాకు ప్రాతిపదిక అయితే, ఒక్కసారి ఊహించండి.. ఎంతమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలో?’’ అని జైట్లీ అన్నారు.
సుప్రీం కోర్టు తాజా తీర్పు దృష్టా చట్టం తన పని చేసుకుపోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా చెప్పారు. బాబ్రీ మసీదు నేలమట్టం కేసులో నిందితులకు శిక్ష పడాల్సిందేనని ఆయన చెప్పారు. బిజెపి మాత్రం సుప్రీం కోర్టు తాజా తీర్పుపై తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు నిరాకరించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసిన తరువాత ఏం చేయాలనేది నిర్ణయిస్తామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషితోపాటు కేంద్ర మంత్రి ఉమాభారతి పట్ల బిజెపికి అత్యధిక గౌరవం ఉన్నదని ఆయన చెప్పారు.

chitram...
బుధవారం తన నివాసంలో విలేఖరులతో మాట్లాడిన తనంతరం ఉమాభారతి హావభావాలు