జాతీయ వార్తలు

ఒకేసారి ఎన్నికలకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీతి ఆయోగ్ భేటీలో సై అన్న చంద్రబాబు

ఏపిని కేంద్రం ఆదుకోవాలి రైల్వే జోన్ తక్షణావసరం
ప్యాకేజీ అమలుపై దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి డిమాండ్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దక్షిణాది రాష్ట్రాలలో అన్నిటికంటే వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలంటే కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో పాల్గొని ప్రసంగించారు. లోక్‌సభతోపాటు శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపే ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేశారు. పాలక మండలి భేటీ అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్‌కే లేదన్నారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపి తలసరి ఆదాయం కూడా చాలా తక్కువన్నారు. విద్యా సంస్థలు, పట్టణ జనాభా తక్కువ ఉండటం, ఆదాయం తక్కువగా ఉండటం వంటి ప్రతికూలతలు సమస్యలు సృష్టిస్తున్నా అధిక అభివృద్ధి రేటును సాధించామని చెప్పారు. విద్యుత్ లోటును అధిగమించామన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ప్యాకేజీని కచ్చితంగా అమలు చేయాలని కోరామన్నారు. మెట్రో రైలు, స్టీల్ ప్లాంటు, పోర్టుల ఏర్పాటులో సహకరించవలసిందిగా కోరినట్లు వివరించారు. కేంద్రం తగిన రీతిలో చేయూత ఇస్తే ఏపి ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదుగుతుందన్నారు. మన్రేగాను వ్యవసాయ కూలీలతో అనుసంధానం చేయాలని నీతి ఆయోగ్‌కు సూచించామన్నారు. జమిలి ఎన్నికలకు తాను సుముఖంగా ఉన్నట్లు చంద్రబాబు వెల్లడిస్తూ మెజారిటీ ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. హిందీ భాషను నేర్చుకోవటంలో తప్పు లేదు కానీ నేర్చుకోవాలని బలవంతపెట్టడం మంచిది కాదన్నారు.
ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై కూడా నీతి ఆయోగ్ భేటీలో చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. డిజిటల్ ఇండియా, మొబైల్ కరెన్సీ తదితర అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగిందన్నారు. రైతుల ఆదాయాన్ని ఐదు సంవత్సరాల్లో రెండింతలు చేసేందుకు అనుసరించవలసిన వ్యూహాన్ని సమీక్షించామన్నారు.