జాతీయ వార్తలు

60 ఏళ్లు దాటిన వారంతా సీనియర్ సిటిజనే్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: వివిధ పథకాల కింద వృద్ధులకు ప్రయోజనాలను కల్పించడంలో అక్రమాలను తొలగించేందుకు ఒకే విధమైన వయో పరిమితిని ప్రామాణికంగా తీసుకుని 60 ఏళ్ల వయసు దాటిన వారందరినీ సీనియర్ సిటిజన్లుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలతోపాటు ప్రైవేటు సంస్థలకు సూచించింది. ఈ మార్పును అమలు చేసేందుకు ఎండబ్ల్యుపిఎస్‌సి (మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్) చట్టాన్ని సవరించేందుకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది.
60ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారిని ఎండబ్ల్యుపిఎస్‌సి చట్టం సీనియర్ సిటిజన్లుగా నిర్వచిస్తోంది. అయితే ఈ క్లాజుల్లోని ‘60 ఏళ్ల కంటే ఎక్కువ’ అనే పదాన్ని వక్రీకరించడంద్వారా వివిధ వయో పరిమితులను అమలు చేస్తూ పలు సంస్థలు సీనియర్ సిటిజన్లకు అందాల్సిన ప్రయోజనాలను నిరాకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘వృద్ధులకు అందాల్సిన ప్రయోజనాలను, రాయితీలను కల్పించడంలో పలు ప్రభుత్వ విభాగాలు వేర్వేరు వయో పరిమితులను ప్రామాణికంగా తీసుకుంటున్నాయని, కొన్ని ప్రైవేటు బీమా సంస్థలు కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. సీనియర్ సిటిజన్లకు ప్రయాణ రాయితీలను కల్పించేందుకు కొద్ది కాలం క్రితం వరకు 63 ఏళ్ల కనీస వయసును ప్రామాణికంగా నిర్దేశించిన ఎయిరిండియా గతవారం ఆ వయో పరిమితిని 60 ఏళ్లకు తగ్గించింది. సామాజిక న్యాయ, సాధికారతా శాఖ మాజీ మంత్రి కుమారి సెల్జా గత యుపిఎ సర్కారు హయాంలో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆ సమస్యను ఆమె పరిష్కరించలేకపోయారని, దీంతో సామాజిక న్యాయ, సాధికారతా మంత్రిత్వ శాఖ ఇటీవల మరోసారి ఈ అంశాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకెళ్లడంతో సినీయర్ సిటిజన్ల కనీస వయో పరిమితిని ఎయిరిండియా 60 ఏళ్లకు తగ్గించిందని ఆ అధికారి వివరించారు.
కాగా భారతీయ రైల్వేలు 58 ఏళ్ల వయసు దాటిన మహిళలను, 60 ఏళ్ల వయసు దాటిన పురుషులను సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తూ ప్రయాణ చార్జీల్లో రాయితీలను కల్పిస్తున్నాయి.