జాతీయ వార్తలు

ఈ దేశంలో మహిళలు శాంతిగా జీవించలేరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ‘ఈ దేశంలో మహిళలు ఎందుకు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు?’ అని దేశంలో మహిళలపట్ల పెరిగిపోతున్న నేరాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఒక వ్యక్తి 16ఏళ్ల బాలికను వేధింపులకు గురిచేసి, ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా చేసినందుకు ఆ రాష్ట్ర హైకోర్టు అతనికి ఏడేళ్ల జైలుశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. దీన్ని సవాలు చేస్తూ ఆ వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్లాడు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎఎం కన్వలికర్, ఎంఎం శంతనగౌడర్‌లతో కూడిన బెంచ్ తన తీర్పును వాయిదా వేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఒక వ్యక్తిని ప్రేమించాలో వద్దో నిర్ణయించుకునే స్వాతంత్య్రం మహిళకు ఉంది. ఒక వ్యక్తిని ప్రేమించమని ఎవరు కూడా ఆమెను బలవంతపెట్టలేరు. ప్రేమ గురించి ప్రతి మహిళకూ ఒక ఆలోచన ఉంటుంది. మగవాడు దాన్ని గౌరవించాలి’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా, మెడికల్ రిపోర్టు ప్రకారం ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ఆ యువతి మాట్లాడడం కానీ, రాయడం కానీ చేయలేదని విచారణ సందర్భంగా నిందితుడి తరఫు లాయరు వాదిస్తూ, ఆమె మరణ వాంగ్మూలం ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే మరణ వాంగ్మూలం ప్రకారం ఆమె ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితిని నిందితుడు కల్పించాడని బెంచ్ వ్యాఖ్యానించింది. 2010 జూలైలో ట్రయల్ కోర్టు నిందితుడ్ని నిర్దోషిగా పేర్కొనగా, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై హైకోర్టులో అపీలు చేసింది.