జాతీయ వార్తలు

మనోవర్తి భారం కాకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: విడాకులు తీసుకున్న భార్యకు చెల్లించే మనోవర్తి కక్షిదారుల స్థితిగతులకు, మనోవర్తి చెల్లించే భర్త సామర్థ్యానికి తగినట్లుగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మనోవర్తి మొత్తం కేసు వాస్తవ పరిస్థితులపై ఆధారపడి ఉండాలని, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని కోర్టులు దాన్ని నిర్ణయించాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. ఒక వ్యక్తి తన మొదటి భార్యకు విడాకులిచ్చిన తర్వాత మరో స్ర్తిని వివాహం చేసుకున్నాడు., ఆమెద్వారా ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని అతను తన మాజీ భార్యకు చెల్లించే మనోవర్తిని నెలకు 23 వేలనుంచి 20 వేల రూపాయలకు తగ్గిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మనోవర్తి మొత్తం భర్త నికర వేతనంలో 25 శాతంగా ఉండడం న్యాయంగా ఉంటుందని పేర్కొంటూ సుప్రీంకోర్టు 1970లో ఇచ్చిన ఒక తీర్పును సైతం న్యాయమూర్తులు ఆర్ భానుమతి, ఎంఎం శంతన గౌడర్‌లతో కూడిన బెంచ్ ప్రస్తావించింది.
భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేసిన సందర్భంలో కలకత్తా హైకోర్టు భర్త తన మాజీ భార్యకు నెలకు 16 వేల రూపాయలు మనోవర్తి ఇవ్వాలని తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పును పునస్సమీక్షించిన హైకోర్టు ఆ మొత్తాన్ని 23 వేలకు పెంచింది. దీన్ని సవాలు చేస్తూ ఆ మాజీ భర్త సుప్రీంకోర్టుకు వెళ్లాడు. మాజీ భర్త వేతనం 63,500నుంచి 95 వేలకు పెరిగినందున మనోవర్తి మొత్తాన్ని హైకోర్టు పెంచడం సబబేనని బెంచ్ అంటూ, అయితే ఆ వ్యక్తి మరోస్ర్తిని వివాహం చేసుకున్నాడని, ఆమెద్వారా ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడని, అందువల్ల ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనోవర్తిని తగ్గించడం న్యాయంగా ఉంటుందని తాము భావిస్తున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు.