అంతర్జాతీయం

ఉగ్రవాదుల దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, జనవరి 4: అఫ్గాన్‌స్తాన్ పట్టణమైన మజార్-ఎ-షరీఫ్‌లోని భారత్ కాన్సిలేట్‌పై ఉగ్రవాదులు దాడి జరిపిన నేపథ్యంలో సోమవారం కూడా పలు పేలుళ్లు, కాల్పుల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఇందులో నక్కిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు అఫ్గాన్ భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్నదానిపై ఎలాంటి ప్రకటనా వెలువడనప్పటికీ ఆరుగురు మిలిటెంట్లతో హోరాహోరీ పోరు కొనసాగుతూనే వుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత కాన్సలేట్‌కు సమీపంలోని ఓ భవనంలో ఉన్న మిలిటెంట్లు తీవ్రస్థాయిలో కాల్పులు సాగిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధం చేసిన దళాలు వారిని పట్టుబెట్టేందుకు అన్ని మార్గాల్లోనూ ముందుకు సాగుతున్నాయి. మిలిటెంట్లు అందరూ భారత కాన్సలేట్‌ను పేల్చివేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. అయితే వీరిని భద్రతా దళాలు ముందుగానే గుర్తించడంతో భారత కాన్సలేట్‌కు సమీపంలోని ఒక భవనంలోకి చొరబడ్డారని అక్కడి నుంచే కాల్పులు జరుపుతున్నారని చెబుతున్నారు.
భారత సిబ్బంది సురక్షితం
అఫ్గాన్‌లోని భారత కాన్సలేట్‌పై ఉగ్రవాదులు దాడి జరిపిన నేపథ్యంలో అందులో ఉన్న భారత దౌత్య సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని దేశ రాయబారి వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా సురక్షితం చేసేందుకు, మిలిటెంట్లను ఏరివేసేందుకు అఫ్గాన్ దళాలు యుద్ధప్రాతిపదికన ముందుకు పోతున్నాయిని భారత రాయబారి అమర్ సిన్హా వెల్లడించారు. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు అఫ్గాన్ దళాలకు, మిలిటెంట్లకు మధ్య కాల్పులు జరిగాయని ఆయన వెల్లడించారు. అయితే మిలిటెంట్లు ఎవరూ భారత కాన్సలేట్‌లోకి ప్రవేశించలేకపోయారని తెలిపారు.
అఫ్గాన్ ప్రజలకు అండ: మోదీ
ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న అఫ్గాన్ ప్రజలకు పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మజార్-ఎ-షరీఫ్‌లోని భారత కాన్సలైట్‌పై మిలిటెంట్ల దాడి నేపథ్యంలో అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ గనీ భారత ప్రధానికి ఫోన్ చేసి తాజా పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ అఫ్గాన్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని తెలిపారు. పఠాన్‌కోట్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని అఫ్గాన్ అధ్యక్షుడు ఖండించారు.