జాతీయ వార్తలు

ప్రాణాంతకంగా మారుతున్న వడగాడ్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో రానురానూ మరింత ప్రాణాంతకంగా మారుతున్న వేసవి వడగాడ్పులు గత నాలుగేళ్లలో 4,620 మందికి పైగా ప్రాణాలను హరించాయి. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే 4,246 మంది మరణించారు. తీవ్రమైన వేడిమి పరిస్థితులతో 2016లో దాదాపు 1,600 మంది మృతి చెందగా, వీరిలో వడగాడ్పుల వలన మృతిచెందిన వారు 557 మంది ఉన్నారని భూవిజ్ఞాన శాఖ వెల్లడించింది. అలాగే 2015లో 2,081 మంది, 2014లో 549 మంది వడగాడ్పుల వలన మృతి చెందగా, 2013లో 1,443 మంది మరణించారని, వీరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మరణించిన వారే 1,393 మంది ఉన్నారని ఆ శాఖ వివరించింది. వడదెబ్బ, డీహైడ్రేషన్ (శరీరంలో నీటి పరిమాణం తగ్గడం) లాంటి ఇతర కారణాలతో సంభవించిన మరణాలను కూడా కలుపుకుంటే ఈ గణాంకాలు మరింత ఎక్కువగా ఉంటాయని గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ దిలీప్ మవ్లాంకర్ స్పష్టం చేశారు. 2010లో వడగాడ్పుల వలన అహ్మదాబాద్‌లో 65 మంది మృతి చెందగా, వేసవి తీవ్రతకు సంబంధించిన ఇతర కారణాలతో మరో 800 మందికి పైగా మరణించారని, హృద్రోగాలు, మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న వారిలో డీహైడ్రేషన్ వలన మూత్రపిండాలతో పాటు శ్వాసకోశ వైఫల్యాలు అధికంగా తలెత్తి ఇటువంటి మరణాలకు దారితీస్తాయని వివరించారు. దేశంలో వేసవి ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతుండటంతో భారత వాతావరణ విభాగం (ఐఎండి) గత ఏడాది నుంచి ప్రజలకు హెచ్చరికలను జారీ చేస్తోందని, ఉష్ణోగ్రత సాధారణ స్థాయిని మించి 6 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ నమోదైనప్పుడు దానిని ‘తీవ్రమైన ఉష్ణోగ్రత’గా పరిగణించి ప్రజలను హెచ్చరించడం జరుగుతుందని తెలిపారు.

ఏఐజెఎస్‌పై రాష్ట్రాల వ్యతిరేకత

రెండు బిజెపి రాష్ట్రాలుసహా వ్యతిరేకించిన ఏడు రాష్ట్రాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జాతీయ స్థాయిలో న్యాయ సర్వీసు (ఏఐజెఎస్) ఏర్పాటు చేయటాన్ని బిజెపిసహా ఏడు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. అరవై ఏళ్లుగా నానుతున్న ఈ ప్రతిపాదనను మోదీ సర్కారు మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయం కోరినప్పుడు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మేఘాలయ, నాగాలాండ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. బిజెపి పాలిత మరో రాష్ట్రం మహారాష్ట్ర మాత్రం రాజ్యాంగబద్ధంగా ఒక ప్రత్యేక పద్ధతిలో నియామకం జరగాలని అభిప్రాయపడింది. న్యాయమంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం బిహార్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్, ఒడిషా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు భారీ మార్పులను సూచించాయి. మరో పదమూడు రాష్ట్రాలు ‘నో రెస్పాన్స్’ అంటూ జవాబిచ్చింది. దీంతోపాటు, ఆంధ్రప్రదేశ్, బాంబే, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మద్రాస్, పాట్నా, పంజాబ్, హర్యానా హైకోర్టులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా లేవు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు.

ఋఖ్యంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్‌లపై తమ అధికారాలను వినియోగించుకోవటం, స్థానిక కోర్టుల్లో స్థానిక భాషను వినియోగించటంపై రాష్ట్రాలు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశానికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమర్థించింది. 1960 నుంచి ఈ ప్రతిపాదన పెండింగ్‌లోనే ఉంది.

ఫ్రాన్స్‌లో మొదలైన
అధ్యక్ష ఎన్నికల పోలింగ్
పారిస్, ఏప్రిల్ 23: ఫ్రాన్స్‌లో ఆదివారం దేశాధ్యక్ష ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల బరిలో మొత్తం 11 మంది అభ్యర్థులునన్నప్పటికీ ప్రధానంగా నలుగురి మధ్య పోటీ ఉంది. 4,7 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గ్రీనిచ్ కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుండగా, ప్రధాన నగరాల్లో మరోగంట సేపు కొనసాగుతుంది. ప్రస్తుత అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే రెండో విడత పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. భద్రతా అంశాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా అభ్యర్థులు ప్రచారం సాగించారు. మే 7న రెండో దశ పోలింగ్ జరుగుతుంది.