జాతీయ వార్తలు

బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, ఏప్రిల్ 23: గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణపై పాక్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన భారతీయుడు కులభూషణ్ జాదవ్‌ను గనుక పాక్ ఉరి తీసినట్లయితే భారత్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యం స్వామి అన్నారు. ‘పాక్ గనుక జాదవ్‌ను ఉరితీసినట్లయితే భారత్ బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించడం ద్వారా దానికి గుణపాఠం చెప్పాలి. అంతేకాదు, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకుగాను పాకిస్తాన్‌ను బలూచిస్థాన్, ఫక్తూనిస్థాన్, సింధ్‌గా విడగొట్టడంద్వారా దానికి గుణపాఠం చెప్పాలి’ అని ఆయన అన్నారు. వడోదరలోని అకోటా ప్రాంతంలో సర్ శాయాజీరావ్ గైక్వాడ్ నగరగృహ ప్రాంతంలో ఆదివారం ‘్భరత్ వికాస్ పరిషత్’ అనే స్వచ్ఛంద సంస్థ ‘్భరత్-అంతర్జాతీయ ఉగ్రవాదం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగిస్తూ స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తాన్‌ను ఉగ్రవాద ప్రోత్సాహిత దేశంగా ప్రకటించినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. పాకిస్తాన్‌ను ముక్కలు చేయడంవల్ల మాత్రమే సీమాంతర ఉగ్రవాదాన్ని మెరుగ్గా ఎదుర్కోవడానికి వీలవుతుంది’ అని రాజ్యసభ సభ్యుడయిన స్వామి అన్నారు. అంతేకాదు, పాకిస్తాన్‌లో తలదాచుకున్న మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టులు హఫీజ్ సరుూద్, దావూద్ ఇబ్రహీంల నివాసాలపైన కూడా దాడులు జరపాలని ఆయన అన్నారు.
పాక్ గడ్డపైనుంచి సాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సాయాన్ని తీసుకోవాలని కూడా స్వామి సూచించారు. ఒక వేళ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తితే అణు బాంబును ఉపయోగిస్తామనే పాక్ బెదిరింపుల గురించి భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఈ అణుబాంబు మీట అమెరికా చేతిలో ఉందని, పాక్ వ్యవహారాలపై దానికి పూర్తి కంట్రోల్ ఉందని కూడా ఆయన అన్నారు. ఉగ్రవాదులు కాశ్మీర్‌లోకి ప్రవేశించడానికి చైనా భూభాగాన్ని ఉపయోగించుకుంటున్నారని, అందువల్ల చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, ఉగ్రవాదంపై పోరులో దాని సహాయాన్ని తీసుకోవాలని కూడా ఆయన ప్రధానిని కోరారు. గతంలో పంజాబ్‌లో ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తూ, ఖలిస్తానీల విచ్ఛిన్నకర కుట్రలను భారత్ వమ్ము చేసిందని, కాశ్మీర్‌లో కూడా ఆ పని చేయాలని సుబ్రహ్మణ్యం స్వామి అన్నారు. భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత కాశ్మీర్‌లో రాళ్లురువ్వే సంఘటనలు ఆగిపోయాయని కూడా ఆయన అన్నారు.

యూపీలో బయోమెట్రిక్
ఉద్యోగుల హాజరు క్రమబద్ధీకరించటమే లక్ష్యం
సీఎం ఆదిత్యనాథ్ నిర్ణయం
లక్నో, ఏప్రిల్ 23: ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరును క్రమబద్దీకరించేందుకు బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అన్ని బ్లాక్‌ల మొదట్లోనే ఈ యంత్రాలను ఏర్పాటు చేయాలని, గ్రామ ప్రధాన్ దగ్గరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు అందరి పనితీరు, ఇతర సమాచారం పక్కాగా సమీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదిత్యనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5.73లక్షల కుటుంబాలకు ఇళ్లు నిర్మాణం చేయాలని, వీటిని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఆధార్ అనుసంధానం చేసి చెల్లింపులు చేస్తామని ఆయన వివరించారు. బుందేల్‌ఖండ్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో మంచినీటి కొరత తీర్చేందుకు నల్లాల ద్వారా నీళ్లు అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం ఉన్న హాండ్‌పంప్‌లను మరమ్మతులు చేయటం, కొత్త పంపులు వేయించటం, పాడైపోయినచోట్ల కొత్తవి వేయించటం వంటి పనులను ఎంఎల్‌ఏలు, ఎం ఎల్‌సిలు బాధ్యత వహించి పూర్తి చేయించాలని ఆదిత్యనాథ్ సూచించారు.