జాతీయ వార్తలు

కళాతపస్వికి దాదా ఫాల్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె. విశ్వనాథ్‌కు అత్యున్నత పురస్కారం
రాష్టప్రతి చేతులమీదుగా మే 3న ప్రదానం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: విశిష్ఠ దర్శకుడు, నటుడు కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును విశ్వనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2016 సంవత్సరానికిగాను ఈ అవార్డుకు కె విశ్వనాథ్‌ను ఎంపికచేస్తూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీ చేసిన సిఫార్సులకు కేంద్ర సమాచారం ప్రసారాల మంత్రి వెంకయ్యనాయుడు సోమవా రం ఆమోదం తెలిపారు. భారతీయ సినిమాకు విశిష్ట సేవలు అందించిన విశ్వనాథ్‌ను 48వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు ద్వారా రూ.10 లక్షల నగదు, స్వర్ణకమలం (గోల్డెన్ లోటస్)తో కేంద్రం సత్కరించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మే 3న జరిగే కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ చేతులమీదుగా విశ్వనాధ్ అవార్డు అందుకుంటారు. సామాజిక అంశాలను ఇతివృత్తాలుగా చేసుకొని సినిమాలు తీయడం ప్రారంభించిన విశ్వనాథ్, తరువాత భారతీయ కళల్లోని ఔన్నత్యానికి పట్టుబట్ట కడుతూ ప్రాధాన్యత కలిగిన ఎన్నో అద్భుత చిత్రాలను తీశారు. తొలుత ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా సిని మా జీవితాన్ని ప్రారంభించిన విశ్వనాథ్, తరువాత దర్శకుడిగామారి 50 చిత్రాల వరకూ దర్శకత్వం వహించారు. భారతీయ సంప్రదాయ సంగీతం, కళలకు ప్రాధన్యతనిస్తూ విశ్వనాథ్ రూపొందించిన చిత్రాలకు దేశంనుంచే కాదు, ప్రపంచం నుంచీ ప్రశంసలు అందాయి. చలన చిత్ర పరిశ్రమకు విశ్వనాథ్ చేసిన కృషికి గుర్తింపుగా 1992లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. కళారంగానికి ఆయన అందించిన నిరుపమాన కృషికి గుర్తింపుగా ఐదు జాతీయస్థాయి అవార్డులు వరించాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20 నంది అవార్డులు నడిచొచ్చాయి. అలాగే 10 లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు సహా, 10 ఫిల్మ్ ఫేర్ అవార్డులనూ విశ్వనాథ్ అందుకున్నారు. స్వాతిముత్యం సినిమా అస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందిన చిత్రంగా గణతికెక్కింది. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సందర్భంలో కేంద్రమత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ భారత చలనచిత్ర పరిశ్రమకు విశ్వనాథ్ ఒక మార్గదర్శి అని కొనియాడారు. కె విశ్వనాథ్ నిర్మించిన చిత్రాలు తరతరాలకు గుర్తుండిపోతాయని, ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేయడం సముచితమని వ్యాఖ్యానించారు.