జాతీయ వార్తలు

మావోయస్టుల ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

26మంది సిఆర్‌పిఎఫ్ జవాన్ల మృతి

పలువురు జవాన్ల గల్లంతు
చత్తీస్‌గఢ్‌లో దారుణం
ఎదురుకాల్పుల్లో 12మంది మావోల మృతి!
ఎవరినీ వదిలి పెట్టం: ప్రధాని హెచ్చరిక
సవాలుగా తీసుకుంటాం: రాజ్‌నాథ్ ప్రకటన
హింసతో సాధించేది ఏంలేదు: సోనియా

జవాన్లపై దాడి దారుణం. తీవ్రంగా ఖండించాల్సిన విషయం. మృతుల కుటుంబాలకు
నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా

జవాన్లను మావోయిస్టులు హతమార్చటం గర్హనీయం. ఇది పిరికిపందల చర్య.
పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అమరుల త్యాగం వృథా పోనివ్వం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా

మావోల ఘాతుకంతో దండకారణ్యం రక్తసిక్తమయ్యింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఆదమరచి ఉన్న జవాన్లపై అదును చూసి దాడి చేశారు. రహదారి నిర్మాణ పనుల పర్యవేక్షణలోవున్న సిఆర్‌పిఎఫ్ బలగాలపై వందలాది మావోయిస్టులు విరుచుకుపడ్డారు. జవాన్లను చుట్టుముట్టి తూటాల వర్షం కురిపించటంతో 26మంది సైనికులు మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పలువురు జవాన్ల జాడ తెలీకుండా పోయంది. పద్దెనిమిది మంది గాయపడ్డారు. కొందరు జవాన్లు తేరుకుని ఎదురు దాడికి దిగడంతో పలువురు మావోయిస్టులు ఖతమైనట్టు సమాచారం. మావోయిస్టుల ఘాతుక చర్య దేశమంతటా సంచలనం సృష్టించింది. రాష్టప్రతి, ప్రధాని తీవ్రంగా స్పందించారు. దారుణానికి ఒడిగట్టిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని, అమరుల త్యాగాలు వృథా పోవని ప్రధాని మోదీ గట్టిగానే హెచ్చరించారు. ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. సిఆర్‌పిఎఫ్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.

చింతూరు, ఏప్రిల్ 24: దండకారణ్యం మరోసారి రక్తసిక్తమయ్యింది. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో అభివృద్ధి పనుల్లో ఆదమరచి ఉన్న జవాన్లపై అదును చూసి దాడి చేశారు. మిట్టమధ్యాహ్నం మండుటెండలో రహదారి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న కేంద్ర రిజర్వు పోలీసు ఫోర్సుపై వందలాది మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అన్ని దిక్కుల నుంచీ వేలకొద్దీ తూటాలు విచ్చలవిడిగా దూసుకొచ్చాయి. ఏం జరుగుతోందో తెలుసుకునే లోగానే భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 26మంది జవాన్లు అమరులయ్యారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా కూడా పెరగవచ్చు. పద్ధెనిమిది మంది గాయపడ్డారు. పలువురు జవాన్ల జాడ తెలియటం లేదని సమాచారం. జవాన్లు తేరుకుని మావోయిస్టులపై తిరిగి జరిపిన కాల్పుల్లో పలువురు చనిపోయినట్లు సమాచారం. కనీసం పది నుంచి 12 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసు వర్గాల సమాచారం. మావోయిస్టుల ఘాతుక చర్య దేశమంతటా సంచలనం సృష్టించింది. రాష్టప్రతి, ప్రధాని సహా తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి ఒడగట్టిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని, అమరుల త్యాగాలు వృథా పోవని ప్రధాని మోదీ గట్టిగానే హెచ్చరించారు. ఈ ఘటనను తాము చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని రాష్ట్రానికి తిరిగి వెళ్లారు. సిఆర్‌పిఎఫ్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ సుదీప్ లక్టాకియా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 12.25గంటలకు ఈ ఘాతుకం చోటు చేసుకుంది. రహదారి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న 74 సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌కు చెందిన జవాన్లపై కాల్పులతో విరుచుకుపడ్డారు. బెజ్జి పోలీసు స్టేషన్ పరిధిలోని బుర్కాపాల్, కొత్తచెరువు, కలాపాఠేల్ ప్రాంతాల్లో నూతనంగా రహదార్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. 74-సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ జవాన్లు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం మొత్తం 112 మంది జవాన్లు బుర్కాపాల్ ప్రాంతంలో రహదార్ల నిర్మాణ పర్యవేక్షణకు వెళ్లారు. చింతగుప్ప వద్ద రోడ్డు నిర్మాణం జరుగుతుండగా అక్కడ కాంట్రాక్టర్‌కు రక్షణగా ఉండేందుకు ఈ జవాన్లు గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. మావోయిస్టులకు గట్టిపట్టు ఉన్న ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న కాంట్రాక్టర్లు, కూలీలకు అండగా ఉండేందుకు ఈ ప్రత్యేక బెటాలియన్‌ను ఏర్పాటు చేశారు. చాలాకాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న మావోయిస్టులు ముందుగా కొందరు గ్రామస్థులను ఘటనాస్థలానికి పంపి, అక్కడి పరిస్థితులపై సమాచారం తెలుసుకున్నారు. పరిస్థితి అంతా తమకు అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తరువాత దాదాపు 300మంది మావోయిస్టులు ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి సిఆర్‌పిఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. మావోయిస్టులు వ్యూహాత్మకంగా విరుచుకుపడటంతో వారి తూటాలకు జవాన్లు బలయ్యారు. జవాన్లు తేరుకోకముందే 26మంది మృత్యువాత పడ్డారు. మరో 18మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 7గురి పరిస్థితి విషమంగా ఉంది. తమపై అనూహ్యంగా విరుచుకుపడిన మావోయిస్టులపై వెంటనే తేరుకున్న సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. సైనికుల కాల్పుల్లో కనీసం పది నుంచి పనె్నండు మంది మావోయిస్టులు చనిపోయారని గాయపడిన జవాను ఒకరు మాలిక్ తెలిపారు. చనిపోయిన వారిలో కంపెనీ కమాండర్, ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారితో పాటు ముగ్గురు ఎస్‌ఐ ర్యాంక్ అధికారులు, ఇద్దరు ఏఎస్‌ఐ ర్యాంక్ అధికారులు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్ళు ఉండగా మిగిలిన వారంతా కానిస్టేబుల్ ర్యాంక్ ఉద్యోగులున్నారు. మృతిచెందిన జవాన్ల వద్ద ఉన్న ఆయుధాలను తీసుకుని మావోయిస్టులు పరారయ్యారు. గాయపడిన జవాన్లలో ఎఎస్సై ఆర్‌పి హెంబ్రమ్, కానిస్టేబుళ్లు స్వరూప్ కుమార్, మొహిందర్‌సింగ్, జితేంద్ర కుమార్, షేర్ మొహ్మద్, ఓరాన్ ఉన్నారు. వీరందరినీ చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా రాయపూర్ తరలించామని సిఆర్‌పిఎఫ్ డిఐజి దినకరన్ తెలిపారు. ప్రత్యేక వాహనాలు, హెలికాప్టర్ల ద్వారా అక్కడకు చేరుకున్న ఉన్నతాధికారులు మృతదేహాలను రాయపూర్‌కు తరలించారు. గాయపడ్డ వారిలో కొందరిని సుకుమా ప్రభుత్వ ఆసుపత్రిలోనూ మరికొంతమందిని రాయపూర్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.కాగా సంఘటనాస్థలానికి భారీఎత్తున భద్రతాబలగాను తరలించి, విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నామని డిఐజి సుందర రాజ్ తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసి వారిని ఎదుర్కోవడంలో కీలకంగా ఉన్న ఐజి కల్లూరితో పాటు మరో ముగ్గురు ఎస్పీలను బదిలీ చేసిన తర్వాత జరిగిన పెద్ద సంఘటన ఇదే కావడం గమనార్హం.
త్యాగం వృథాపోదు: మోదీ
ఈ ఘటనపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. అమరుల త్యాగాలను వృథా పోనివ్వమని, ఎవరినీ వదిలేది లేదని మోదీ తీవ్రంగా హెచ్చరించారు. కేంద్రం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుందని ఇక మావోలతో తేల్చుకుంటామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమన్‌సింగ్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని హుటాహుటిన రాయ్‌పూర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను పరామర్శించారు. సిఆర్‌పిఎఫ్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ సుదీప్ లక్టాకియా ఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
chitram...

మృతదేహాలను, గాయపడిన వారిని
ప్రత్యేక వాహనంలో తరలిస్తున్న దృశ్యం