జాతీయ వార్తలు

ఆవులకూ ఆధార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: భారత బంగ్లా సరిహద్దుల్లో ఆవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు, పాడి పశువుల సంరక్షణకు దేశ వ్యాప్తంగా ప్రతి పశువుకూ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని నిపుణుల కమిటీ సూచించిందని కేంద్రప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఆవులు, ఇతర పశువులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేస్తామని, రాష్ట్రాల వారిగా వివరాలు పొందుపరుస్తామని కేంద్రం తెలియజేసింది. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను కోర్టుకు సమర్పించింది. భారత్ క్రిషి గోసేవా సంఘ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. బంగ్లాదేశ్‌తో పాటు నేపాల్‌కు కూడా గోవుల స్మగ్లింగ్‌పై పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్టీఓ, పోలీస్, పశు సంవర్ధక శాఖలు సమన్వయంతో పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. కేంద్ర స్థాయిలో పర్యావరణ, అటవీ శాఖ, డైరీ, ఫిషరీస్, వ్యవసాయ శాఖలు స్మగ్లింగ్ జరగకుండా పర్యవేక్షణ జరపాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి పశువుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి మార్పిడికి వీలు లేని విధంగా ఒక ప్రత్యేక తాడును ఆవుకు తగిలించాలని కమిటీ సూచించింది. దేశంలోని అన్ని పశువులకూ ఇది తప్పనిసరి చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది.
పశువు వయసు, లింగం, ఎత్తు, రంగు, ఆహారం తదితర సమాచారాన్ని ఈ యుడిఐ ట్యాగ్‌లో పొందుపరుస్తారు. సరైన లైసెన్స్ ఉన్న వాళ్లు మాత్రమే పశువుల ఎగుమతికి అర్హులని చట్టం చెప్తుంది. ఈ సిఫార్సులను అమలు చేస్తామని సుప్రీంకు కేంద్రం తెలిపింది. వట్టిపోయన పశువులను సంరక్షించేందుకు ప్రతి గ్రామంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేస్తామని పేర్కొంది.