జాతీయ వార్తలు

రాష్ట్రానికి ఐదు హడ్కో అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఐదు అవార్డులు ప్రదానం చేసింది. దేశ రాజధానిలో మంగళవారం హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హడ్కో సేవలు అందిస్తున్న రాష్ట్రాలకు, వివిధ సంస్ధలకు అవార్డులను ప్రదానం చేసింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ)కు రెండు అవార్డులు లభించాయి. వీటిని సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీ్ధర్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పట్టణ వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (హెచ్‌డీఐఎల్)కు, ఏపీఎస్‌ఆర్‌టిసికి, నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్‌కు తలో అవార్డు లభించాయి.
అమరావతికి ‘టెరి’ చేయూత
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని పర్యావరణ అనుకూల నగరంగా నిర్మిచేందుకు ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో సిఆర్‌డిఎ ఒప్పందం కుదుర్చుకుంది. సీఆర్‌డిఏ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు టెరీ (ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్) డైరెక్టర్ జనరల్ అజయ్ మాథూర్‌తో ఢిల్లీలో సమావేశమై చర్చలు జరిపారు. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంలో ఏపీ ముందంజలో ఉందని ఈ సందర్భంగా మాథుర్‌కు అజయ్ జైన్, శ్రీధర్ వివరించారు. అమరావతిలో టెరి కార్యాలయం ఏర్పాటు కానున్నట్టు శ్రీధర్ తెలిపారు.