జాతీయ వార్తలు

మోదీ ప్రభంజనాన్ని ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిలిగురి, ఏప్రిల్ 25: పశ్చిమబెంగాల్‌లో దూసుకొస్తున్న మోదీ రథాన్ని అడ్డుకునే శక్తి తృణమూల్ కాంగ్రెస్‌కు లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బెంగాల్‌లో కమలం వికసించటం తథ్యమని ఆయన అన్నారు. ‘మోదీ రథాన్ని అడ్డుకోగలమని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తూండవచ్చు. వాళ్లు మమ్మల్ని ఎంతగా అడ్డుకోవాలని చూస్తే, అంతకంటే వేగంగా కమలం బెంగాల్‌లో వికసిస్తుంది’ అని ఆయన అన్నారు. నక్సల్‌బరి గ్రామంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో అత్యధిక సీట్లను గెలుచుకుంటుంది. దేశమంతా దీనికి సాక్షీభూతంగా నిలుస్తుంది’ అని షా వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో ఒకప్పుడు దేశంలోనే ముందంజలో ఉన్న బెంగాల్ ఇప్పుడు వెనకబడిపోయిందని, మైనార్టీల సంతుష్టీకరణ విధానాన్ని తృణమూల్ ప్రభుత్వం అనుసరిస్తోందని ఆయన ఆరోపించారు. మూడు రోజుల పర్యటన కోసం నక్సల్‌బరికి వచ్చిన అమిత్ షా స్థానికంగా ఒక గిరిజనుడి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. అన్నం, సెనగపప్పు, దుంపకూర, పాపడ్‌లతో అరిటాకుపై భోజనం చేశారు. రానున్న పదిహేను రోజుల్లో అయిదు రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు షా పేర్కొన్నారు. దేశంలోని ప్రతిమూలా ‘మోదీ సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’ విస్తరించాలని, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగటమే ముఖ్యమని, అయితే బెంగాల్‌లో టిఎంసి ప్రభుత్వం ఇందుకు అంగీకరించటం లేదని షా అన్నారు. ‘నక్సలైట్లు నక్సల్‌బరి నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభించారు. ఇప్పుడు అభివృద్ధి కూడా ఇక్కడినుంచే మొదలు కావాలి. మోదీ నేతృత్వంలో బెంగాల్ అభివృద్ధి పథంలో పయనిస్తుంది’ అని షా వ్యాఖ్యానించారు.

చిత్రం... నక్సల్‌బరిలో మంగళవారం ఒక గిరిజనుడి ఇంట్లో భోజనం చేస్తున్న అమిత్ షా