జాతీయ వార్తలు

నేడు ‘ఉడాన్’ పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ‘యుడిఎఎన్’ (ఉడాన్) పథకాన్ని ప్రారంభించనున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని పెంచడానికి తక్కువ వ్యయంతో విమానయాన సౌకర్యాన్ని ఈ పథకం కల్పిస్తుంది. సిమ్లా- ఢిల్లీ సెక్టార్‌తో పాటు కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ సెక్టార్లలో విమాన సర్వీసులను ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచడానికి ఉడాన్ (ఉడే దేశ్‌కా ఆమ్ నాగ్‌రిక్) వంటి పథకాన్ని ప్రారంభించడం ప్రపంచంలోనే ఇది మొదటిసారని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) బుధవారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొంది. ప్రాంతీయంగా ముఖ్యమైన ప్రదేశాల మధ్య పౌరులకు విమానయానాన్ని అందుబాటులోకి తేవడానికి ఉడాన్ ఆర్‌సిఎస్ (రీజనల్ కనెక్టివిటీ స్కీమ్)ను 2016 అక్టోబర్‌లో ప్రవేశపెట్టడం జరిగిందని పిఎంఒ వివరించింది. 2016 జూన్ 15న విడుదల చేసిన జాతీయ పౌర విమానయాన విధానం (ఎన్‌సిఎపి)లో ఉడాన్ పథకం ఒక ముఖ్యమైన అంశం. సుమారు 500 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంటసేపు విమానంలో ప్రయాణించడానికి లేదా హెలికాప్టర్‌లో 30 నిమిషాల సేపు ప్రయాణించడానికి ఎయిర్‌ఫేర్‌ను గరిష్ఠంగా రూ.2,500గా నిర్ణయించినట్లు పిఎంఒ వివరించింది. సిమ్లాలోని చరిత్రాత్మక రిడ్గే మైదాన్‌లో ప్రధానమంత్రి బహిరంగ సభలో మాట్లాడతారని పిఎంఒ తెలిపింది.