తెలంగాణ

పల్లె గొంతెండుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

15 వేల గ్రామాల్లో తాగునీటి ఎద్దడి కొరత తీర్చేందుకు ప్రభుత్వ యత్నం

హైదరాబాద్, ఏప్రిల్ 29 : తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 24 వేల నివాస ప్రాంతాలుండగా, వీటిలో 15,692 నివాసప్రాంతాలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేసిన ప్రకటన ప్రకారం 1057 గ్రామాల్లో బోర్‌వెల్‌లు తవ్వడంపై నిషేధం విధించారు. భూగర్భ జలాలు ఎక్కువగా వాడుతున్నారన్న కారణంతో ఈ నిషేధం విధిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. 2016 వానాకాలంలో అధికారిక లెక్కల ప్రకారం సాధారణ వర్షాలు కురిసినట్టు నమోదైంది. అయితే దాదాపు 100 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురిశాయి. ఒకేపర్యాయం భారీ వర్షాలు కురవడం, దాదాపు నెలరోజులపాటు వర్షాభావ పరిస్థితి ఏర్పడటం తదితర కారణాల వల్ల గ్రామాల్లో భూగర్భజలాలు బాగా అడుగంటిపోయాయి. ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రెండు నెలల పాటు (2017 మే-జూన్) తాగునీటిని అందించగలిగితే గట్టెక్కినట్టేనని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపైనే పంచాయితీ, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతాధికారులతోనూ, జిల్లాస్థాయి అధికారులతోనూ సమీక్షించారు. తాగునీటికి కొరత ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే ప్రైవేట్ బోర్‌వెల్స్‌ను అద్దెకు తీసుకుని, రవాణాద్వారానో, తాగునీటి పథకానికి అనుసంధానం చేయడం ద్వారానో ప్రజలకు నీటిని అందించాలని ఆదేశించారు. నిధులకు కొరత లేదని, కలెక్టర్లు కోరినంత మేరకు నిధులు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో పాటు కేంద్రప్రభుత్వం విడుదల చేసిన 135 కోట్ల రూపాయల కెలామిటీ రిలీఫ్ ఫండ్ (సిఆర్‌ఎఫ్) ను ఉపయోగించాలని మంత్రి ఆదేశించారు. 2015-16 సంవత్సరంలో వర్షాభావ పరిస్థితి వల్ల 231 మండలాలు కరవుపీడిత ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ, తాగునీటికి ఇక్కట్లు లేకుండా చూశామని, 2016 వానాకాలంలో వర్షాలు బాగానే కురిసినప్పటికీ తాగునీటికి ఇక్కట్లు పడటం మంచిది కాదన్నారు.
భగీరథ ప్రయత్నం
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేందుకే మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టామని గ్రామీణ తాగునీటి పథకం, మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ సురేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, 40 వేల కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయని, వివిధ నీటి వనరుల ద్వారా తాగునీటికి 63 టిఎంసిల నీటిని వాడతామన్నారు. ప్రస్తుత సంవత్సరం 317 కోట్లతో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.