జాతీయ వార్తలు

అంతర్గత భద్రత ఆందోళనకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: దేశ అంతర్గత భద్రతపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల నుంచి ఎయిర్‌బేస్ లాంటి వ్యూహాత్మక స్థావరాలను పరిరక్షించుకోవాల్సి ఉందన్న సోనియా ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిని తిప్పికొట్టిన భద్రతా సిబ్బందిని కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రశంసించారు. దేశ భద్రతకోసం ప్రాణాలు అర్పించిన మృతవీరులకు ఆమె ప్రగాఢ సంతాపం తెలిపారు. సైనిక అధికారుల కుటుంబ సభ్యులకు సోనియా సానుభూతి తెలిపారు. పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ కాంప్లెక్స్‌పై జైషే ఉగ్రవాదుల దాడి యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. భద్రతాదళాలు చేపట్టిన ఆపరేషన్ సుదీర్ఘంగా సాగింది. ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టిన భద్రతా సిబ్బంది శాల్యూట్ అంటూ కాంగ్రెస్ అధినేత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పఠాన్‌కోట్ సంఘటనను తీవ్రంగా పరిగణించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కీలక స్థావరాలు, ప్రజలకు తగినంత భద్రత కల్పించాలని సోనియా స్పష్టం చేశారు.
కేంద్రం విఫలం: కాంగ్రెస్
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగిన ఉగ్రవాదులను మట్టుపెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి, ఆ తరువాత నెలకొన్న పరిణామాలను పరిశీలిస్తుంటే అంతర్గత భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పలు అనుమానాలుకు తావిస్తోందని చెప్పారు. ఎయిర్ బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు అవసరమైన పకడ్బందీ కంట్రోల్, కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేయటంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అజయ్ మాకెన్ ఆరోపించారు. మూడు రోజులు కావస్తున్నా ఉగ్రవాదులను మట్టుపెట్టకపోవటం ఏమిటని ప్రశ్నించారు. పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర మంత్రివర్గం భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం ఎందుకు జరగలేదని మాకెన్ నిలదీశారు. పఠాన్‌కోట్‌లో సైన్యం ఉగ్రవాదులతో పోరాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం కర్నాటకలో యోగా గురించి పాఠాలు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ గోవాలో ఏం చేస్తున్నారని నిలదీశారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సాయంత్రం ఏడు గంటలకు విలేఖరులతో మాట్లాడుతూ ఉగ్రవాదుల ఏరివేత పూర్తయిందని ప్రకటించి, ఆ తరువాత మాట మార్చారని విమర్శించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాజీ రాయబారులతో సమావేశం జరిపి అసంబద్ధ ప్రతిస్పందన ఇవ్వటం విచిత్రంగా ఉన్నదని మాకెన్ విమర్శించారు. భద్రతా దళాలు ఉగ్రవాదులతో పోరాడుతుంటే పంజాబ్‌కు చెందిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ మాత్రం ఉగ్రవాదులపై దాడిని విజయవంతంగా ముగించినందుకు అభినందించటం విచిత్రంగా ఉన్నదని అన్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారనే మాట ప్రధాని నోట ఎందుకు రాలేదని మాకెన్ నిలదీశారు. గతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్రం మీదుగా వచ్చి ముంబాయిపై దాడి చేసినప్పుడు హుటాహుటిన అక్కడికి చేరుకోగలిగిన మోదీ ఇప్పుడు పఠాన్‌కోట్ ఎందుకు వెళ్లలేదని మాకెన్ నిలదీశారు. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం ముందే వచ్చినా దాడిని ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. అంతర్గత దర్యాప్తుకు ఆదేశించినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన చెప్పారు.