జాతీయ వార్తలు

జాప్యమే విశ్వసనీయతకు విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదలకు సకాలంలో న్యాయ సహాయం అందాలి
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖేహార్
న్యాయ ప్రక్రియలో టెక్నాలజీ వినియోగం పెరగాలి
కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: పేదలు, నిరక్షరాస్యులయిన భారతీయులకు సకాలంలో న్యాయ సహాయం అందకపోవడం వల్ల న్యాయ వ్యవస్థ, న్యాయ పాలన విశ్వసనీయతకు తీవ్ర విఘాతం కలిగిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ అన్నారు. పారా లీగల్ వలంటీర్ల ప్రాముఖ్యత గురించి నొక్కి చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణ, నిస్సహాయులయిన ప్రజలు తమ బాధలను పోగొట్టుకోవడానికి, తమకు జరిగిన అన్యాయాన్ని తొలగించుకోవడానికి న్యాయ వ్యవస్థ ప్రయోజనాలను ఉపయోగించుకునేందుకు పారా లీగల్ వలంటీర్లు (పిఎల్‌విలు) బాగా దోహదపడుతారని ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ ప్రధాన కక్షిదారులు పేదలు, నిరక్షరాస్యులేనని ఆయన చెప్పారు. పారా లీగల్ వలంటీర్లపై ఇక్కడ జరిగిన రెండు రోజుల జాతీయ సమావేశంలో పాల్గొన్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ న్యాయ సేవలను అందించడంలో, న్యాయ పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అన్నారు. సమావేశాన్ని జస్టిస్ ఖేహార్ ప్రారంభిస్తూ, పేదలకు సేవ చేయడం ద్వారా వలంటీర్లు అతి పవిత్రమైన విధి నిర్వహిస్తున్నారని అన్నారు. పిఎల్‌వి పథకం కింద గ్రామీణులకు న్యాయ సేవలు అందించేది న్యాయవాదులు కాదని, పారా లీగల్ వలంటీర్లని ఆయన పేర్కొన్నారు. న్యాయశాస్త్రంలో కనీస స్థాయి శిక్షణ పొందిన ఈ వలంటీర్లు వివాదాలను పరిష్కరించడం తమ వల్ల కానప్పుడు లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం వంటి అందుబాటులో ఉన్న లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదిస్తారని ఆయన పేర్కొన్నారు. 2009 పారా లీగల్ వలంటీర్ స్కీమ్ చట్టం కింద ఈ వలంటీర్లు శిక్షణ పొందారని తెలిపారు. ఈ వలంటీర్లు పేదలు, పాలనాధికారులు, కోర్టుల సమయాన్ని, డబ్బును ఆదా చేస్తారని చెప్పారు.
న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంచవలసిన అవసరం ఉందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాలం వేగంగా మారుతోందని, అందువల్ల మారుతున్న కాలానికి అనుగుణంగా మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. న్యాయ పాలనలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమైన పనిముట్టు అని అన్నారు.
దేశంలోని 125 కోట్ల మంది ప్రజల్లో 108 కోట్ల మంది ప్రజల వద్ద మొబైల్ ఫోన్లు ఉన్నాయని, వీరిలో 35 కోట్ల మంది వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, అతి త్వరలోనే వీరి సంఖ్య 50 కోట్లకు చేరుకుంటుందని ఆయన వివరించారు. 113 కోట్ల మంది ప్రజల వద్ద ఆధార్ కార్డులున్నాయని పేర్కొన్న మంత్రి, ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటం వల్ల అంతకు మించి మాట్లాడదలచుకోలేదని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సుపరిపాలనను అందించవచ్చని ఆయన అన్నారు. కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్‌సి) అనే ప్రభుత్వ పథకంతో గ్రామాలు, చిన్న పట్టణాల్లోని ప్రజలు డిజిటల్ సర్వీస్‌లను పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీలో శనివారం పారా లీగల్ వలంటీర్లపై జరిగిన సదస్సులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, సుప్రీం చీఫ్ జస్టిస్ ఖేహర్