జాతీయ వార్తలు

గన్నవరానికి అంతర్జాతీయ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయా హోదా కల్పిస్తూ కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.బుధవారం నాడు ప్రథాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రి వర్గం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. గన్నవరానికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించటంతో ఈ విమానాశ్రయంలో మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీ నూతన రాజధానికి ఈ విమానాశ్రయం మెరుగైన సేవలను అందించనుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు సేవలు అందించడం, కార్గో ట్రాఫిక్‌కు ఇది ఉపయోగ పడటం ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఈ విమానాశ్రయం దోహదం చేయనుంది. కేబినెట్ నిర్ణయంతో విజయవాడ నుంచి పలు అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు వివిధ ఎయిర్‌లైన్స్ సంస్థలు నడిపేందుకు అవకాశం ఏర్పడింది. అంతర్జాతీయ విమానాశ్రయంలోతగిన విధంగా కార్యకలాపాలను సాగించేందుకు అనుగుణంగా రాత్రి పూట విమానాల రాక పోకలకు అనుమతినివ్వటంతో పాటు, అందుకు అనుగుణంగా రన్‌వే విస్తరణ, సౌకర్యాల కల్పన చేస్తారు. విదేశీ ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, వైద్య సదుపాయాలు ఉన్నందున ఈ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను కల్పించింది. అలాగే రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీ, ఏపి ప్రభుత్వం చేస్తున్న డిమాండ్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రం అమోదం తెలిపింది.